కమ్మ, వెలమ సంఘాలకు భూ కేటాయింపుపై టీఎస్ హైకోర్టులో విచారణ

కమ్మ, వెలమ సంఘాలకు భూ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.కేయూ విశ్రాంత ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సీజే బెంచ్ విచారణ చేపట్టింది.

2021లో ఖానామెట్ లో ఐదు ఎకరాల చొప్పన ఉచితంగా కేటాయింపులు జరిగిన విషయం తెలిసిందే.అయితే కులాల వారీగా భూములు కేటాయించడం ఆర్టికల్ 14కి విరుద్ధమని కోర్టు తెలిపింది.ఈ సందర్భంగా ప్రభుత్వ తీరు సమాజంలో కులాల విభజనకు దారితీసేలా ఉందని వ్యాఖ్యనించింది.21వ శతాబ్దంలో హైటెక్ రాష్ట్రంలోనూ ఇదేమి విధానమని హైకోర్టు పేర్కొంది.కులాల వారీగా భూ కేటాయింపులు అసంబద్ధమని, తప్పని వెల్లడించింది.

ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాలకే భూములు ఇవ్వాలని తెలిపింది.కులాంతర వివాహాలను ప్రోత్సహించడం వంటి విధానాలు ఉండాలని, ప్రభుత్వం విశాలంగా ఆలోచించాలని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యనించింది.

అటు నోటీసులకు స్పందించనందుకు కమ్మ సమాఖ్య వాదనలు వినబోమని స్పష్టం చేసింది.ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేసేందుకు వెలమ అసోసియేషన్ ధర్మాసనాన్ని సమయం కోరింది.

Advertisement

దీంతో తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

ఆయన మరణ వార్త చదువుతూ ఏడ్చేసిన యాంకర్..
Advertisement

తాజా వార్తలు