ఏపీ ప్రభుత్వ జీవో నెంబర్ .1పై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఇందులో భాగంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని తెలిపింది.
ఈనెల 23న హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరుపుతుందని సుప్రీం ధర్మాసనం తెలపింది.ఏపీలో రోడ్లపై సభలు, సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం నిషేధం విధిస్తూ జీవో నెంబర్.1 ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.అయితే జీవోను రద్దు చేయాలని కోరుతూ సీపీఐ రామకృష్ణ పిటిషన్ దాఖలు చేయగా… విచారణ జరిపిన హైకోర్టు జీవోపై తాత్కాలికంగా స్టే విధించింది.దీనిపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.







