వైరల్.. అసలు విషయం తెలియక ఆగం అయిన ఎలుక!

ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకోవడం చాలామందికి అభిరుచి, అలవాటు.ఇవి యజమానుల పట్ల విశ్వాసపాత్రంగా మెలుగుతాయి.

 Innocent Rat Waking Up Fainted Woman,woman Prank,prank Videos, Rat, Woman,viral-TeluguStop.com

వారికి రక్షణ కల్పిస్తాయి.వాటితో కాలక్షేపం చేస్తున్నారు.

అవి చూపే స్వచ్ఛమైన ప్రేమను ఆస్వాదిస్తున్నారు.ఇంట్లో పెంపుడు జంతువులు ఉండడం సమాజంలో ఒక హోదాగా కూడా మారింది.

మన దేశంలో అయితే సాధారణంగా కుక్కలు, పిల్లులు, మరికొన్ని రకాల పక్షులను పెంచుకుంటారు.కానీ, విదేశాల్లో మాత్రం ఎలుకలు, ఇతర జంతువులను కూడా సాకుతారు.

యజమానులపై పెంపుడు జంతువులకు అమితమైన ప్రేమ ఉంటుంది.తమ యజమానికి కొంచెం ఏమైనా అయిందంటే చాలు.

వారి పెంపుడు జంతువులు తల్లడిల్లిపోతాయి.ఎవరైనా సరదాగా వారిని కొట్టినా.

ఆ పెంపుడు జంతువులు అస్సలు సహించవు.అయితే, తాజాగా ఓ పెంపుడు జంతువుకు తన యజమాని పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే.ఓ యువతి తన ఇంట్లో ఎలుకను పెంచుకుంటుంది.అయితే, ఆ యువతి తన ఎలుకపై ప్రాంక్ చేయాలని నిర్ణయించుకుంది.అందులో భాగంగా ఒక ప్లాన్ వేసింది.

ముందుగా యువతి ఒక గది నుంచి మరో గదిలోకి వచ్చి.సొమ్మసిల్లి పడిపోయినట్లుగా నటిస్తూ నేలపై పడుకుంది.

అయితే, ఆ విషయం తెలియని పెంపుడు ఎలుక. తన యజమాని కింద పడిపోవడం చూసి ఏదో అయ్యిందని కంగారు పడింది.

అమ్మాయి వద్దకు వచ్చి.ఆమెను తట్టి లేపేందుకు ప్రయత్నిస్తోంది.

ఆమెపైనే అటూ ఇటూ తిరుగుతూ కంగారు పడింది.ఇక ఎలుక బాధను చూడలేక ఆ యువతి పైకి లేచింది.

ఆ ఎలుక ఊపిరి పీల్చుకుంది.అయితే, ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.

అది వైరల్ అయ్యింది.నెటిజన్లు ఆ ఎలుక ప్రేమకు ఫిదా అయిపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube