వైరల్.. అసలు విషయం తెలియక ఆగం అయిన ఎలుక!
TeluguStop.com

ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకోవడం చాలామందికి అభిరుచి, అలవాటు.ఇవి యజమానుల పట్ల విశ్వాసపాత్రంగా మెలుగుతాయి.


వారికి రక్షణ కల్పిస్తాయి.వాటితో కాలక్షేపం చేస్తున్నారు.


అవి చూపే స్వచ్ఛమైన ప్రేమను ఆస్వాదిస్తున్నారు.ఇంట్లో పెంపుడు జంతువులు ఉండడం సమాజంలో ఒక హోదాగా కూడా మారింది.
మన దేశంలో అయితే సాధారణంగా కుక్కలు, పిల్లులు, మరికొన్ని రకాల పక్షులను పెంచుకుంటారు.
కానీ, విదేశాల్లో మాత్రం ఎలుకలు, ఇతర జంతువులను కూడా సాకుతారు.యజమానులపై పెంపుడు జంతువులకు అమితమైన ప్రేమ ఉంటుంది.
తమ యజమానికి కొంచెం ఏమైనా అయిందంటే చాలు.వారి పెంపుడు జంతువులు తల్లడిల్లిపోతాయి.
ఎవరైనా సరదాగా వారిని కొట్టినా.ఆ పెంపుడు జంతువులు అస్సలు సహించవు.
అయితే, తాజాగా ఓ పెంపుడు జంతువుకు తన యజమాని పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.ఓ యువతి తన ఇంట్లో ఎలుకను పెంచుకుంటుంది.
అయితే, ఆ యువతి తన ఎలుకపై ప్రాంక్ చేయాలని నిర్ణయించుకుంది.అందులో భాగంగా ఒక ప్లాన్ వేసింది.
ముందుగా యువతి ఒక గది నుంచి మరో గదిలోకి వచ్చి.సొమ్మసిల్లి పడిపోయినట్లుగా నటిస్తూ నేలపై పడుకుంది.
అయితే, ఆ విషయం తెలియని పెంపుడు ఎలుక.తన యజమాని కింద పడిపోవడం చూసి ఏదో అయ్యిందని కంగారు పడింది.
అమ్మాయి వద్దకు వచ్చి.ఆమెను తట్టి లేపేందుకు ప్రయత్నిస్తోంది.
ఆమెపైనే అటూ ఇటూ తిరుగుతూ కంగారు పడింది.ఇక ఎలుక బాధను చూడలేక ఆ యువతి పైకి లేచింది.
ఆ ఎలుక ఊపిరి పీల్చుకుంది.అయితే, ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.
అది వైరల్ అయ్యింది.నెటిజన్లు ఆ ఎలుక ప్రేమకు ఫిదా అయిపోతున్నారు.
అమెరికన్ స్పేస్ కంపెనీనికి సారథిగా భారతీయుడు.. ఎవరీ తేజ్‌పాల్ భాటియా?