ప్రజా ప్రభుత్వంలో విద్యారంగానికి తీవ్ర అన్యాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని విస్మరించిందని టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు లక్షల తొంభై వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా విద్యారంగానికి కేవలం ఇరవై ఒక్క వేల కోట్లు కేటాయించడం అంటే బడ్జెట్ మొత్తంలో ఏడు శాతం నిధులు కేటాయించడం తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు.

పదహేన్ శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని కానీ బడ్జెట్లో హామీ మేరకు నిధులు కేటాయించకపోవడం దారుణం అన్నారు.ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ వైద్య రంగానికి కేవలం పదకొండు వేల అయిదు వందల కోట్లు కేటాయించడం సిగ్గుచేటు అన్నారు.

రాష్ట్రంలో ఉన్న ప్రతి యూనివర్సిటీకి అయిదు వందల కోట్లు కేటాయించాల్సింది పోయి రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటిలకి కలిపి అయిదు వందల కోట్లు కేటాయిస్తే వారి నిర్వహణకె సరిపోతాయని యూనివర్సిటీల అభివృద్ధి ఎలా జరుగుతుందని అన్నారు.ఫీజు రియంబర్స్మెంట్,మెస్ చార్జీల పెంపుపై ప్రకటనలేదని విద్యార్థులకు లాప్టాప్ లు,విద్యార్థినిలకు ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తానని హామీ ఇచ్చారు కానీ బడ్జెట్ కేటాయింపులో ప్రస్తావించలేదని బడ్జెట్ ను సవరించి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గత కేసిఆర్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలలో దాదాపు 8 వేల కోట్ల ఫీజు బకాయిలు ఉండగా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఫీజుబకాయలను చెల్లిస్తుందనుకుంటే ఫీజు బకాయిల ఊసే ఎత్తలేదని మండిపడ్డారు.ఇప్పటికైనా ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Advertisement

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరే మల్లేశం,తుమ్మనపెళ్లి సత్యం,టీఎన్ఎస్ఎఫ్ ముస్తాబాద్ మండల అధ్యక్షుడు శ్యాగ ప్రశాంత్ పాల్గొన్నారు.

సెస్ హెల్పర్ పిల్లలు సర్కార్ బడికి..
Advertisement

Latest Rajanna Sircilla News