మన టాలీవుడ్ లో ఇద్దరు ప్రముఖుల మధ్య ట్వీట్ వార్ జరుగుతుంది.సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది.
ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.ఇంతకీ ఎవరా అని ఆలోచిస్తున్నారా.
టాలీవుడ్ డైరెక్టర్ లలో ఒకరైన హరీష్ శంకర్, బివిఎస్ రవి.ఇప్పుడు వీరిద్దరి మధ్య వార్ చూస్తుంటే వారి మధ్య కొన్ని విబేధాలు ఉన్నాయని అర్ధం అవుతుంది.
ఇప్పటి వరకు టాలీవుడ్ డైరెక్టర్ లలో ఎప్పుడు ఇలాంటి గొడవలు జరగలేదు.ఒకవేళ గొడవలు ఉన్న కూడా వాళ్లలో వాళ్లే మాట్లాడుకుని పరిష్కరించుకుంటూ ఉంటారు.అయితే ఇప్పుడు ఈ వార్ కాస్త పబ్లిక్ గా జరుగుతుంటే అందరు వీరి వైపు అటెన్షన్ గా ఉన్నారు.వీరి మధ్య ట్వీట్ వార్ చూస్తుంటే వారి మధ్య విబేధాలు ఉన్నాయని అనిపించక మానదు.
ఇంతకీ వీరి మధ్య ట్వీట్ వార్ జరగడానికి అసలు కారణం ఏంటి? వీరిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి కారణం ఏంటి? ఇవి తెలియాలంటే పూర్తి మ్యాటర్ తెలుసు కోవాల్సిందే.నిన్న రాత్రి బివిఎస్ రవి ఒక ట్వీట్ చేసాడు.ఇది ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి చేసినట్టుగా అందరికి అనిపిస్తుంది.”అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలెడితే ప్రజలు పతనం పరిచయం చేస్తారని తరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతుంది” అని ట్వీట్ చేసాడు.
అయితే ఈ ట్వీట్ ఇద్దరి మధ్య రచ్చకు కారణం అయ్యింది.వెంటనే ఈ ట్వీట్ కు హరీష్ శంకర్ స్పందిస్తూ.”అనుభవించమని ఇచ్చారా??” అని ప్రశ్నించాడు.అలా స్టార్ట్ చేసిన ఈ వార్ నిన్న రాత్రి నుండి ఇప్పటికి వీరిద్దరి మధ్య జరుగుతున్న ట్విట్టర్ రచ్చ ఏంటో వాళ్ళ ట్వీట్స్ ఏంటో అర్ధం కాక ప్రేక్షకులు అయోమయానికి గురి అవుతున్నారు.