డబ్ల్యూటీసీ ఫైనల్ లో భారత్ చెత్త ప్రదర్శన.. ఫీల్డింగ్ కంటే బ్యాటింగ్ దారుణం..!

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్( World Test Championship Final Match ) లో భారత్ ఫీల్డింగ్ కంటే బ్యాటింగ్ దారుణంగా ఉంది.రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది.

 India Worst Performance In Wtc Final Details, Sports News,cricket News,team Indi-TeluguStop.com

ఇంకా భారత్ 318 పరుగులు చేయాల్సి ఉంది.

భారత బ్యాటర్లైన రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ( Rohit Sharma, Shubman Gill, Virat Kohli ) అతి దారుణమైన ఆటను ప్రదర్శించి పెవిలియన్ చేరడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.ప్రస్తుతం క్రీజులో ఉన్న అజింక్య రహనే, శ్రీకర్ భరత్( Ajinkya Rahane, Srikar Bharat ) లపైనే కాస్త ఆశలు మిగిలి ఉన్నాయి.రహానే చాలా కాలం తర్వాత ఐపీఎల్ లో అద్భుత ఆటను ప్రదర్శించి ఈ అవకాశం దక్కించుకున్నాడు.

కాబట్టి ఇటువంటి సమయంలో భారత్ ను ఆదుకుంటే మంచి గుర్తింపు దక్కుతుంది.

భారత్ తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ 26 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.శుబ్ మన్ గిల్ 15 బంతుల్లో 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.ఇక పూజారా 25 బంతుల్లో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

విరాట్ కోహ్లీ కూడా కేవలం 14 పరుగులకే అవుట్ అవ్వడంతో ఇక భారత జట్టు ప్రమాదంలో పడింది.కానీ రవీంద్ర జడేజా 51 బంతులలో 48 పరుగులు చేసి భారత్ కు కాస్త ఊరట కలిగించాడు.

కానీ రవీంద్ర జడేజా 48 పరుగుల కు అవుట్ అవడంతో ప్రస్తుతం భారత జట్టు పరిస్థితి దారుణంగా ఉంది.

ఇక క్రీజులో ఉన్న అజింక్య రహనే 29 పరుగులతో, శ్రీకర్ భరత్ 5 పరుగులతో ఉన్నారు.

భారత్ ను గట్టెక్కించే బాధ్యత వీరిపై ఉంది.వీరిద్దరూ ఈరోజు ఎక్కువసేపు క్రీజులో ఉంటే ఫలితాలలో కాస్త మార్పు కనిపించే అవకాశం ఉంది.

ఇక తరువాత శార్దూల్ ఠాగూర్, ఉమేష్ యాదవ్ లు బ్యాటింగ్ కు దిగుతారు.భారత్ తొలి ఇన్నింగ్స్ లో మరో 269 పరుగులు జోడిస్తే ఫాలో ఆన్ నుంచి బయటపడే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube