రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Ellareddypet ) మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ కాలనీకి చెందిన అల్లే మధు 33 అనే యువకుడు గత నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో మరణించగా మండల కేంద్రానికి చెందిన చిన్ననాటి మిత్రులు కలిసి హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ బాధితుని భార్య లావణ్యను పరామర్శించి మనో ధైర్యాన్ని కల్పిస్తూ 50 కేజీల బియ్యాన్ని అందజేశారు.ఈ సహాయ కార్యక్రమంలో సభ్యులు ఓరుగంటి నరేందర్, ఎస్కే గౌస్, సాన రాజు, చందనం రాఘవేందర్, దుబ్బ శ్రీనివాస్, అల్లం శ్రీకాంత్, సుంకి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News