ప్రజల సమస్యల అవసరాల కోసం,భద్రత కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పునస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వీర్నపల్లి,రుద్రంగి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్.రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని వీర్నపల్లి,రుద్రంగి పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రజలకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక చొరవతో (న్యూరో ఫిజీషియన్,జనరల్ మెడిసిన్, పిల్లల స్పెషలిస్ట్, ఈ .

 We Are Always Available For People's Problem Needs And Security , Security-TeluguStop.com

ఎన్ .టీ ) నిపుణులైన డాక్టర్ల బృందాన్ని పిలిపించి మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు 500 మంది ప్రజలు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి,తగు ఆరోగ్య సూచనలు చేసి మందులను అందజేయడం జరిగింది.ఈ వైద్య శిబిరాలకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.ప్రజలకు పోలీస్ సేవలు మరింత దగ్గర అవ్వడానికి పోలీస్ ఉన్నది మీకోసం మీ భద్రత కోసమే అనే నమ్మకం కలగడం కోరకు మీ కోసం కార్యక్రమంలో భాగంగా వీర్నపల్లి,రుద్రంగి మండలాలలోని మారుమూల ఉన్న గ్రామాల నుండి ప్రజలు ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చొరవ తీసుకొని వీర్నపల్లి మండలం రంగంపేట్ గ్రామంలో,రుద్రంగి మండలం మానాల గ్రామంలో నిపుణులు అయిన వైద్య బృందంతో ఉచిత మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేసి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశామని అన్నారు.ఈ వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని,ఆరోగ్య సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించరాదని,ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకొని ఆసమస్యలను తొలగించుకోవాలని సూచించారు.

జిల్లాలో మారుమూల ప్రాంతంలో నివసించే ప్రజల అభివృద్ధి,సంక్షేమం కోసం జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడు కృషి చేస్తుందని,జిల్లాలోని వీర్నపల్లి,రుద్రంగి పోలీస్ స్టేషన్లో పనిచేసే పోలీసు అధికారులు మరియు సిబ్బంది ఎల్లప్పుడూ మారుమూల గ్రామాల్లో నివసించే ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.ఉచిత వైద్య శిబిరం కి పోలీస్ వారు అడగానే ఒప్పుకొని వచ్చిన హాస్పిటల్ వారికీ, డాక్టర్ ల బృందంకి ఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,డా.విక్రమ్ సింహరెడ్డి న్యూరో ఫిజీషియన్,డా.

అరుణ జనరల్ మెడిసిన్,డా.నీలిమ పిల్లల డాక్టర్,లక్ష్మీ ప్రియా జనరల్ మెడిసిన్, డా.అభినాయ్ ఎంబిబిఎస్,డా.రవీందర్,డా యాదగిరి గౌడ్,సి.

ఐ మోగిలి,కిరణ్, ఎస్.ఐ లు నవత, ప్రభాకర్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube