రష్యా వ్యాక్సిన్ పై భారతీయుల ఎదురుచూపు !

ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది.ఇప్పటికే కొన్ని దేశాలు ప్రయోగాలు నిర్వహించగా సత్ఫలితాలు కనిపిస్తున్నాయి.

పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులో రాకపోయినా కొన్ని రోజుల పాటు చికిత్స చేయించి వైరస్ నుంచి క్యూర్ అవ్వొచ్చు.అయితే రష్యా ఇప్పటికే స్పుత్నిక్ అనే వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన విషయం అందరికి తెలిసిందే.

ఆగస్టు 12వ తారీఖున రష్యా ప్రభుత్వం వ్యాక్సిన్ ను విడుదల చేసింది.దీంతో వ్యాక్సిన్ కోసం 20 దేశాలు దరఖాస్తు వస్తున్నాయని, బిలియన్ డోసుల వరకు వ్యాక్సిన్ తయారు చేయాల్సి వస్తోందని రష్యా ప్రకటించింది.

ప్రపంచంలోనే కరోనాకు తొలి వ్యాక్సిన్ ను రష్యా కనుగొంది.స్పుత్నిక్ వ్యాక్సిన్ కోసం 20 దేశాలు ఆసక్తి చూపుతున్నారని, వ్యాక్సిన్ తయారీకి భారతీయ సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నారని రష్యా అధికారికంగా ప్రకటించింది.

Advertisement

క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి ఫలితాల సమాచారాన్ని ఇవ్వాలని, భారత కంపెనీలు కోరినట్లు రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్టీఐఎఫ్) వెల్లడించింది.గమలేమ రీసెర్చ్ ఇనిస్టిట్యూడ్ సహకారంతో రష్యా రక్షణ శాఖ తయారు చేసిన ఈ వ్యాక్సిన్ కు మార్కెంటింగ్ చేసే అధికారాలు ఆర్డీఐఎఫ్ కు ఉండటంతో భారత రాయబార కార్యవర్గం చర్చలు జరుపుతోంది.

ఈ మేరకు రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ ఛీప్ కిరిల్లీ దిమిత్రోవ్ తో భారత రాయబారి వెంకటేశ్ వర్మ చర్చించారు.తొందర్లో ఈ వ్యాక్సిన్ ను భారత్ లో ఉత్పత్తి చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు