ఆస్ట్రేలియా పౌరసత్వం: అగ్రస్థానంలో భారతీయులు, గతేడాది కంటే 60 శాతం పెరుగుదల

విద్య, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు క్రమక్రమంగా అక్కడి సమాజంలో కలిసిపోతున్నారు.

ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు.

తాజాగా ఆస్ట్రేలియా పౌరసత్వం పొందడంలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు. 2019- 2020 సంవత్సరానికి సంబంధించి తమ దేశ పౌరసత్వం పొందిన విదేశీ పౌరుల జాబితాను ఆస్ట్రేలియా ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

Indians Lead In Acquiring Australian Citizenship In 2019-20, Australian Citizens

అధికారిక లెక్కల ప్రకారం 2019-2020 సంవత్సరానికి గాను 2 లక్షల మంది విదేశీ పౌరులకు తమ దేశ పౌరసత్వం ఇవ్వగా.ఇందులో భారతీయుల వాటా 38,209.

ఇది గతేడాదితో పోలిస్తే 60 శాతం అధికం.మన తర్వాతి స్థానంలో బ్రిటన్ జాతీయులు 25,011, చైనీయులు 14,764, పాకిస్తానీయులు 8,821 మంది వున్నారు.

Advertisement

ఈ సందర్భంగా ఆస్ట్రేలియా పౌరసత్వం పొందిన వారికి ఆ దేశ ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.పౌరసత్వంతో వచ్చిన హక్కులను వినియోగించుకుంటూ పౌరుడిగా బాధ్యతలను కూడా నిర్వర్తించాలని ఆయన సూచించారు.2016 గణాంకాల ప్రకారం ఆస్ట్రేలియాలో 6,19,164 మంది భారత సంతతి ప్రజలున్నారు.

ఇండియన్ దుస్తుల్లో అమెరికా ఉపాధ్యక్షుడి పిల్లలు. అనార్కలీ, కుర్తాలో అదరగొట్టారు...
Advertisement

తాజా వార్తలు