వేతనాలు చెల్లించమన్నందుకు .. ఖతార్ చెరలో భారతీయుడు, విడుదలకై ఎదురుచూపులు

ఖతార్‌లో ఇటీవల ముగిసిన ఫిఫా ప్రపంచకప్ ( FIFA World Cup )సందర్భంగా నిఎర్బంధించబడిన సెక్యూరిటీ గార్డులను నాలుగు నెలల తర్వాత దేశంలోనే వుంచినట్లుగా అంతర్జాతీయ వార్తాసంస్థ ది గార్డియన్ ( News agency The Guardian )నివేదించింది.

వేతనాల వివాదంలో వారిని అదుపులోకి తీసుకున్నారు.

నివేదిక ప్రకారం.అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు పాకిస్తాన్ పౌరులు కాగా, ఒకరు భారతీయుడు.వీరికి ఒక్కొక్కరికి 10,000 రియాల్స్ (భారత కరెన్సీలో రూ.2,20,000) జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధించారు.

ఫిఫా వరల్డ్ కప్ కోసం స్థానిక ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థ స్టార్క్ సర్వీసెస్( Stark Services ) ద్వారా భారతీయుడు, ఇద్దరు పాక్ జాతీయులు సెక్యూరిటీ గార్డులుగా నియమితులయ్యారు.అయితే వారిని కాంట్రాక్ట్ ముగియడానికి మరికొన్ని నెలలు వున్నప్పటికీ.మ్యాచ్ ముగిసిన కొన్నిరోజులకే వారిని విధుల నుంచి తొలగించారు.

ఈ విషయం తెలుసుకున్న మానవ హక్కుల సంఘం వారిని తక్షణమే విడుదల చేయాలని ఖతార్ ( Qatar )ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.ఈ ముగ్గురే కాకుండా.ఒప్పందం ముగియకుండానే మరో తొమ్మిది మందిని కూడా విధుల నుంచి తొలగించినట్లు నివేదిక వెల్లడించింది.

Advertisement

వీరిలో నలుగురిని దేశం నుంచి బహిష్కరించగా.మరో ఐదుగురిని విధుల నుంచి తొలగించారు.

వీరు ఇప్పటికే ఖతార్‌లోనే వున్నారని మీడియా నివేదిక చెబుతోంది.

కాగా.తమకు పెండింగ్‌లో వున్న వేతన బకాయిలు చెల్లించాలంటూ ఈ ఏడాది జనవరి 23న 200 మంది సెక్యూరిటీ గార్డులు( Security guards ) ఓ బస్సులో సదరు సెక్యూరిటీ కంపెనీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని ఆందోళన నిర్వహించారు.ఈ క్రమంలో కార్మికులు.

రోడ్డుపై రాకపోకలను అడ్డుకుంటున్నారంటూ కంపెనీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే తమ నేతలు తప్పించి మిగిలిన వారెవ్వరూ బస్సు దిగలేదని గార్డులు చెబుతున్నారు.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

ఈ క్రమంలోనే ముగ్గురు గార్డులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.ఈ నేపథ్యంలో వారు తమను విడుదల చేసే రోజు కోసం నిరీక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు