America indian students :అమెరికాకు క్యూ కడుతున్న భారతీయ విద్యార్ధులు...2021 -22 ఏడాదిలో...

అగ్ర రాజ్యం అమెరికాలో ఉద్యోగం, వ్యాపారం, విద్య ఏ రంగంలోనైనా సారే అడుగు పెట్టేందుకు ప్రపంచ దేశాల నుంచీ ఎంతో మంది అమెరికాకు వలసలు వెళ్తుంటారు.

ముఖ్యంగా భారత్ నుంచీ అమెరికా వెళ్ళే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది.

అయితే కరోనా కాలంలో ఉన్న ఆంక్షల నేపధ్యంలో అమెరికా వలసలపై షరతులు విధించడమే గాక, పూర్తిగా నిలిపివేసింది.కానీ అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్ధులకు మాత్రం షరతులతో కూడిన అనుమతులు ఇస్తూ అమెరికాలోకి ఆహ్వానించింది.

దాంతో భారతీయ విద్యార్ధులు అమెరికాకు క్యూ కట్టారు.ప్రస్తుతం కరోనా నిభందనలు పూర్తిగా తొలగించడంతో ప్రస్తుతం అమెరికాకు వెళ్ళే భారతీయ విద్యార్ధుల సంఖ్య భారీగా పెరిగింది, ఈ నేపధ్యంలో.

ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్ నేషనల్ ఎడ్యుకేషన్ కీలక ప్రకటన విడుదల చేసింది.భారతీయ విద్యార్ధులు గడిచిన ఏడాది అంటే 2021-22 నాటికి సుమారు 2 లక్షల మంది అమెరికాలోని వర్సిటీలలో చేరారట.గడిచిన ఏడాది దాదాపు 1.60 లక్షల మంది భారతీయ విద్యార్ధులు అమెరికాకు చదువుకునేందుకు వెళ్ళగా 2021-22 నాటికి 40 వేల మంది పెరిగారట.కాగా 2021 -22 విద్యా సంవత్సరానికి అమెరికాకు వెళ్ళిన విద్యార్ధుల సంఖ్య 9.50 లక్షలు ఉండగా వారిలో సుమారు 21 శాతం మంది భారతీయ విద్యార్ధులు ఉండటం గమనార్హం.అయితే.

Advertisement

చైనా ఈ విషయంలో భారత్ కంటే ముందుందనే చెప్పాలి.ఆ దేశం నుంచీ సుమారు 2.90 లక్షల మందికి పైగా విద్యార్ధులు అమెరికాకు ఉన్నత చదువుల నేపధ్యంలో వలసలు వెళ్లారట.అయితే అమెరికా కరోనా సమయంలో విద్యార్ధుల ఎంట్రీ పై ఆంక్షలు విధించిన నేపధ్యంలో చాలామంది విద్యార్ధులు కెనడా వైపు వెళ్ళినా ప్రస్తుత నివేదికల దృష్ట్యా అమెరికాలో చదువుకోవాలనే ఆసక్తి భారతీయ విద్యార్ధులలో ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు