కెనడా : ఇకపై ఫుల్ టైం ఉద్యోగాలు...ఏ కేటగిరి విద్యార్ధులు అర్హులంటే...!!

డాలర్ తో పోల్చితే మన రూపాయి మారకం క్రమ క్రమంగా తగ్గుతోంది, ఈ పరిస్థితులలో భారతీయ విద్యార్ధులకు విదేశాలలో చదువుకోవడం తలకు మించిన భారంగా మారుతోంది.మన రూపాయి విలువ పడిపోతుంటే భారతీయ విద్యార్ధుల చదువులపై భారం భారీగా పెరిగిపోతుంది.

 Indian Students May Now Work For More Than 20 Hours Per Week In Canada,canada,in-TeluguStop.com

ఈ పరిస్థితి విదేశాలలో చదువుకునే ప్రతీ ఒక్క భారతీయ విద్యార్ధికి తలకు మించిన భారం కాబోతోంది.ఈ నేపధ్యంలో కెనడా మాత్రం తమ దేశంలో చదువుకుంటున్న విద్యార్ధులకు ఊరట కలిగించే వార్త ప్రకటించింది.అదేంటంటే

విదేశీ విద్యార్ధులు ఎవరైనా సరే ఇకపై కెనడా లో ఫుల్ టైం ఉద్యోగాలు చేసుకోవచ్చు.ఈ ప్రకటన తో విదేశీ విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేశారు.అయితే అందుకు కొన్ని కండిషన్స్, ఏ కేటగిరి కి చెందిన విద్యార్ధులు ఇందుకు అర్హులో వెల్లడించారు.ఫుల్ టైం ఉద్యోగాలు చేసుకునేందుకు కేవలం సెలవుల సమయంలో మాత్రమే అవకాశం ఇచ్చారు.

సమ్మర్ హాలిడేస్, రీడింగ్ వీక్స్, వింటర్ హాలిడేస్ లో ఫుల్ టైం ఉద్యోగాలు చేసుకోవచు.ఈ నిభందన నవంబర్ 15 నుంచీ అమలు కానుంది.

డిసెంబర్ 31 వరకూ ఈ నిభందన వర్తిస్తుంది.అయితే ఈ పరిమితిని మళ్ళీ పెంచుతారా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.ఇదిలాఉంటే

Telugu Canada, Full Time Jobs, Indian, Indians, Time-Telugu NRI

కెనడా ప్రభుత్వ నిభందనల ప్రకారం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలలో ఫుల్ టైం విద్యార్ధిగా ఉన్న వాళ్ళే ఇందుకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది.అంతేకాదు డిప్లమో, ఒకేషనల్ లేదా ప్రొఫెషనల్ కోర్సులు చేసే వాళ్ళు కూడా ఫుల్ టైం ఉద్యోగాలు చేసేందుకు అర్హులుగా ప్రకటించింది.ఇక్కడ మరొక నిభందన ఉంది.ఈ కోర్సులు చదివే విద్యార్ధులు ఆయా కోర్సుల కాల వ్యవధి కనీసం 6 నెలలు ఉండాల్సిందే.కెనడా విద్యార్ధులకు ఈ విషయంలో వెసులుబాటు ఇవ్వడంతో విదేశీ విద్యార్ధులకు ఎంతో లాభం కలుగుతుందని, వారి తల్లి తండ్రులపై ఆర్ధిక భారం పడకుండా ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube