అమెరికాలో రోడ్డు ప్రమాదం.. చావుబతుకుల మధ్య భారతీయ విద్యార్ధిని,‘‘ గో ఫండ్ మీ’’ పేజీకి భారీగా విరాళాలు

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతీయ విద్యార్ధిని అమెరికాలో చావు బతుకుల మధ్య పోరాడుతోంది.వివరాల్లోకి వెళితే.

అర్కాన్సాస్ రాష్ట్రంలో ఈమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టి తీవ్రంగా గాయపడింది.రోడ్డుపై మంచు కురుస్తూ వుండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

బాధితురాలిని కాన్సాస్‌లోని విచిత స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతోన్న శ్రీలిఖిత పిన్నమ్‌గా గుర్తించారు.ఈమె జనవరి 30 రాత్రి తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా.

అర్కాన్సాస్ రాష్ట్రంలోని బెంటన్‌విల్లేకు సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది.

Advertisement

కారు రెండు పల్టీలు కొట్టడంతో లిఖిత తలకు బలమైన గాయాలయ్యాయి.దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది.బాధితురాలికి సాయం చేసేందుకు ఆమె సోదరి ‘‘GoFundMe’’ పేజీ ఏర్పాటు చేసింది.

ఇదే ప్రమాదంలో లిఖితతో పాటు వున్న ఆమె స్నేహితులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.వీరందరిని నార్త్ వెస్ట్ అర్కాన్సాస్‌లోని మెర్సీ ఆసుపత్రికి తరలించారు.

లిఖిత పరిస్ధితి అప్పటికే విషమంగా వుండటంతో ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు.

గో ఫండ్ మీ పేజీ ప్రకారం.బాధితురాలి మెదడుకు బలమైన గాయాలైనట్లుగా తెలుస్తోంది.ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

లిఖిత పరిస్ధితి విషమంగా వుందని తెలిపారు.ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై వుంచి చికిత్స అందిస్తున్నామని, అయితే కొన్నిరోజులుగా లిఖిత చికిత్సకు స్పందించడం లేదని పేర్కొన్నారు.

Advertisement

ఆమె కోలుకోవడానికి నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చని చెప్పారు.లిఖితను ఆదుకునేందుకు అమెరికాలో స్థిరపడిన పలువురు ప్రవాస భారతీయులు, స్థానికులు ముందుకు వస్తున్నారు.ఇప్పటి వరకు 1,50,000కు గాను.99,659 డాలర్లు అందాయని లిఖిత కుటుంబ సభ్యులు తెలిపారు.త్వరలోనే అసలు లక్ష్యానికి చేరుకుంటామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇకపోతే.అర్కాన్సాస్‌లో రహదారులపై మంచు కురవడం వల్ల గతంలో పలు ప్రమాదాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

తాజా వార్తలు