అమెరికాలో అడ్మిషన్ కోసం.. బతికున్న తండ్రిని చనిపోయాడని , వెలుగులోకి భారతీయ విద్యార్ధి బాగోతం

అమెరికా విశ్వవిద్యాలయంలో తప్పుడు పత్రాలతో అడ్మిషన్ పొందిన 19 ఏళ్ల భారతీయ విద్యార్ధిని( Indian Student ) పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే అమెరికా అధికారులతో కుదుర్చుకున్న అభ్యర్ధన ఒప్పందం ప్రకారం అతను భారతదేశానికి తిరిగి వెళ్లిపోవాలి.

నిందితుడిని ఆర్యన్ ఆనంద్‌గా( Aryan Anand ) గుర్తించారు.ఇతను 2023-24 విద్యా సంవత్సరానికి గాను పెన్సిల్వేనియాలోని ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ అయిన లేహి వర్సిటీలో( Lehigh University ) అడ్మిషన్ పొందేందుకు నకిలీ, తప్పుడు పత్రాలను సమర్పించాడు.

ది బ్రౌన్ అండ్ వైట్‌ వార్తాపత్రికలో గత నెలలో వచ్చిన నివేదిక ప్రకారం.ఇతను అడ్మిషన్, ఫైనాన్షియల్ ఎయిడ్ డాక్యుమెంట్లను తప్పుగా చూపించినట్లు పోలీసుల విచారణలో తేలింది.అడ్మిషన్, స్కాలర్‌షిప్ పొందే కుట్రలో భాగంగా అతను ఏకంగా తండ్రి చనిపోయినట్లుగా పత్రాలను సృష్టించాడు.

జూన్ 12న ఆనంద్‌ను మెజిస్టీరియల్ డిస్ట్రిక్ట్ జడ్జి జోర్డాన్ నిస్లీ ఎదుట హాజరు పరచగా.అతను నేరాన్ని అంగీకరించాడు.

Advertisement

అభ్యర్ధన ఒప్పందంలో భాగంగా.ఆనంద్‌కు నార్తాంప్టన్ కౌంటీ జైలులో( Northampton County Prison ) ఒకటి నుంచి మూడు నెలల పాటు ఉండాల్సి ఉంటుందని డిఫెన్స్ అటార్నీ మోలీ హీడోర్న్ పేర్కొన్నారు.ఒప్పందం ప్రకారం ఆనంద్ భారతదేశానికి తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుంది.

అతనిని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కస్టడీకి అప్పగించారు.నార్తాంప్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ స్టీఫెన్ బరట్టా కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.

ఆనంద్ పాఠశాల ప్రిన్సిపాల్‌గా నటించి నకిలీ ఈమెయిల్‌ ఐడీని సృష్టించారని పేర్కొంది.అతని తండ్రి సజీవంగా , భారత్‌లోనే ఉన్నారని వివరించారు.

సోషల్ మీడియా సైట్ రెడ్డిట్‌లో నేను నా జీవితాన్ని, వృత్తిని అబద్ధాలతో నిర్మించుకున్నాను అనే శీర్షికతో ఆనంద్ ఓ పోస్ట్ పెట్టడంతో అతని ఫోర్జరీ బాగోతం, అడ్మిషన్ వెలుగులోకి వచ్చింది.రెడ్డిట్ మానిటర్.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

ఏప్రిల్ 26న లేహి అడ్మిషన్స్ డిపార్ట్‌మెంట్‌కి పోస్ట్ గురించి తెలియజేయడంతో దర్యాప్తు ప్రారంభమైందని బ్రౌన్ అండ్ వైట్ నివేదిక పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు