గో బ్యాక్ టూ ఇండియా : అల్బేనియాలో భారత సంతతి మహిళపై జాత్యహంకార వ్యాఖ్యలు

అల్బేనియన్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో జాసన్ డెరు( Jason Derulo ) కచేరీకి హాజరైన భారత సంతతి మహిళ అక్కడి స్థానికుల నుంచి జాత్యహంకారాన్ని, విద్వేషాన్ని ఎదుర్కొంది.

దీనికి సంబంధించిన వీడియోను ఓ ఎక్స్ యూజర్ ట్వీట్ చేశారు.

అందులో భారత సంతతికి చెందిన మహిళ తనపై నలుగురు స్థానిక యువతులు జాతి విద్వేష వ్యాఖ్యలు చేశారని తెలిపారు.వారు లైన్‌లో తనను దాటి వెళ్లారని.

ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించగా.ఆ అమ్మాయిలు తనను గో బ్యాక్ టూ ఇండియా అని దూషించారని , నవ్వుతూ , అసభ్యకరమైన సైగలు చేసినట్లు బాధితురాలు తెలిపింది.

బాధితురాలిని డాక్టర్ ప్రణోతి క్షీరసాగర్‌గా గుర్తించారు.తనకు అల్బేనియా అద్భుతంగా స్వాగతం పలికింది, గ్రేట్ జాబ్.చాలా థ్యాంక్స్ అంటూ ఆమె వ్యంగ్యంగా వీడియోను ముగించారు.తొలుత ఈ వీడియోను డాక్టర్ ప్రణోతి( Dr.Kshirsagar ) టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేశారు.ఈ వీడియో ఆగస్ట్ 20న పోస్ట్ చేయగా అప్పటి నుంచి 2.6 మిలియన్ల వీక్షణలు, అనేక కామెంట్స్‌ను పొందింది.కొంతమంది ఎక్స్ యూజర్లు భారత సంతతికి చెందిన మహిళకు మద్ధతుగా నిలిచారు.

Advertisement

అల్బేనియా పర్యాటకానికి సురక్షిత స్థలం కాదని సూచించారు.అల్బేనియా అల్బేనియన్ల కోసం, భారతదేశం భారతీయులకు, జర్మనీ జర్మన్లకంటూ ఓ యూజర్ ఈ పనిని వెనకేసుకొచ్చినట్లుగా కామెంట్ చేశాడు.

మరో వ్యక్తి కూడా .గో బ్యాక్ ప్లీజ్.మీ కమ్యూనిటీకి సహాయం చేయండి, వచ్చి మా సంఘాన్ని నాశనం చేయొద్దని రాశాడు.

దీనికి భారతీయులు, నెటిజన్లు కౌంటర్ ఇస్తూ.బాధితురాలికి అండగా నిలిచారు.అల్బేనియన్లు కూడా ఈయూ, యూకేకి వలస వెళ్లినప్పుడు ఎదుర్కొన్న వివక్ష, జాత్యహంకారంపై ఫిర్యాదు చేసిన ఘటనలను గుర్తుచేశారు.

మొత్తానికి ఈ వైరల్ వీడియో పర్యాటకం, జాత్యహంకారం చుట్టూ ఉన్న సవాళ్లు, విభిన్న అభిప్రాయాలను రెండింటినీ హైలైట్ చేసింది.విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల పట్ల గౌరవ ప్రదమైన ప్రవర్తనతో ఉండాలని సూచించారు.

కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?
Advertisement

తాజా వార్తలు