అమెరికా : భారత సంతతి విద్యార్ధికి ఇల్లినాయిస్ స్టేట్ యూనివర్సిటీ టీచింగ్ అవార్డ్

అమెరికాలో భారత సంతతి విద్యార్ధి అరుదైన పురస్కారం అందుకున్నాడు.

విరాజ్ పటేల్ ( Viraj Patel )అనే విద్యార్ధి ఇల్లినాయిస్ స్టేట్ యూనివర్సిటీ టీచింగ్‌ అవార్డ్‌( Illinois State University Teaching Award )కు ఎంపికయ్యాడు.

వర్సిటీలో తన ప్రోగ్రామ్, విద్యాపరమైన అనుభవానికి గాను అత్యుత్తమ సహకారం అందించినందుకు గాను ఆయనకు 2022వ సంవత్సరానికి ‘‘University Graduate Student Teaching Award ’’ అవార్డ్ అందుకున్నాడు.యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్‌లో విరాజ్ పటేల్ రెండవ సంవత్సరం డాక్టోరల్ విద్యార్ధి .పబ్లిక్ స్పీకింగ్, కమ్యూనికేషన్‌లో ఆయన ఎప్పుడూ నిమగ్నమై వుంటాడని తోటి విద్యార్ధులు, ఫ్యాకల్టీ చెబుతోంది.పబ్లిక్ స్పీకింగ్ ( Public speaking )అంటే తనకు చాలా ఇష్టమని, క్లాస్‌లో విద్యార్ధులకు మార్గనిర్దేశనం చేయడం ఎంతో సంతృప్తినిస్తోందని పటేల్ అన్నారు.ఇటీవల ఇల్లినాయిస్ వెస్లియన్ విశ్వవిద్యాలయంలోని ఓరియంటేషన్ సర్వీసెస్ కార్యాలయంలో విరాజ్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్‌గా పనిచేశాడు.400 ప్లస్ మొదటి సంవత్సరం విద్యార్ధుల కోసం సెమిస్టర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌లను ప్లాన్ చేయడంలోనూ సహాయం చేశాడు.యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ టీచింగ్ అవార్డ్.

గ్రాడ్యుయేట్ టీచింగ్ అసిస్టెంట్‌లకు గుర్తింపునిస్తుంది.

ఇకపోతే.రెండ్రోజుల క్రితం అమెరికాలో భారత సంతతి ప్రొఫెసర్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం లభించిన సంగతి తెలిసిందే.న్యూయార్క్‌లోని అల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా వున్న డాక్టర్ నిత్యా అబ్రహం( Dr Nithya Abraham )కు ‘‘యంగ్ యూరాలజిస్ట్’’ అవార్డ్ దక్కింది.

Advertisement

యువ యూరాలజిస్టుల అభివృద్ధికి చేసిన కృషికి గాను నిత్యను ఈ పురస్కారం వరించింది.మాంటెఫియోర్ యూరాలజీ రెసిడెన్సీ ప్రోగ్రామ్ కింద నిత్య ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.న్యూయార్క్‌లో తను పనిచేస్తున్న సంస్థలో ఎంతోమంది విద్యార్ధులకు, సహచరులకు, జూనియర్ ఫ్యాకల్టీకి ఆమె మార్గనిర్దేశనం చేస్తున్నారు.

తనకు దక్కిన గౌరవంపై నిత్య హర్షం వ్యక్తం చేశారు.ప్రస్తుతం వైద్యుల్లో నిరాశా నిస్పృహలతో పాటు డాక్టర్ల కొరత నేతృత్వంలో అమెరికన్ యూరాలజికల్ అసోసియేషన్ , దాని నాయకులు దేశవ్యాప్తంగా యువ యూరాలజిస్టుల కృష్టిని గుర్తించడం అద్భుతంగా వుందన్నారు.అమెరికన్ యూరాలజికల్ అసోసియేషన్ (ఏయూఏ) ప్రకారం.

పదేళ్లు లేదా అంతకంటే తక్కువ కాలం ప్రాక్టీస్ చేసిన వ్యక్తిని యంగ్ యూరాలజిస్ట్‌గా నిర్వచించింది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు