అలా చూస్తే.. ఇలా పట్టేస్తాయి, అడ్వాన్స్ రోబోలు రెడీ: భారత సంతతి శాస్త్రవేత్త సారథ్యంలో...!!

రాబోయే కాలంలో మానవ అవసరాలు తీర్చేందుకు గాను శాస్త్రవేత్తలు రోబోట్లను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.రోజువారీ పనులతో పాటు అత్యవసర సమయాల్లో స్పందించేలా రోబోలను రూపొందిస్తున్నారు.

దీనివల్ల ధీర్ఘకాలంలో మనిషికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.ముఖ్యంగా ఉపాధి అవకాశాలు గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు.

అయితే శాస్త్రవేత్తలు మాత్రం రోబోలపై తమ ప్రయోగాలను కొనసాగిస్తున్నారు.తాజాగా రోబోలు మనుషులకు రోజువారీ పనులు చేసిపెట్టే విధంగా ఒక అద్భుతమైన వ్యవస్థను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు.

ఈ పరిశోధక బృందానికి భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త అంకిత్ షా నేతృత్వం వహిస్తున్నారు.మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ‘‘ ప్లానింగ్ విత్ ఆన్‌సర్టన్ స్పెసిఫికేషన్స్ (పీయూఎస్ఎస్) అని పేరుతో పరిశోధనలు నిర్వహిస్తున్నారు.

Advertisement

దీని ద్వారా ఎలాంటి ప్రోగ్రామింగ్ నైపుణ్యం లేనివారు కూడా ఈ మరమనుషులకు శిక్షణ ఇచ్చేందుకు ఇది మార్గం సుగమం చేస్తుంది.ఫలితంగా భవిష్యత్‌లో ఇంటి పనులు చేసేలా రోబోలను తీర్చిదిద్దవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు.

పని ప్రదేశాల్లో కొత్త ఉద్యోగుల తరహాలో వీటికి శిక్షణ ఇవ్వవచ్చు.

ప్రస్తుత, భవిష్యత్ ఫలితాలపై తార్కికంగా ఆలోచించడానికి రోబోలకు వీలు కల్పించే ‘‘లీనియర్ టెంపోరల్ లాజిక్’’ (ఎల్‌టీఎల్) ఆధారంగా రోబోలు పనిచేస్తాయి.దీని వల్ల మనుషులను పరిశీలిస్తూ రోబోలు ఏం చేయాలో తెలుసుకోగలుగుతాయి.ఇంజనీర్లు ముందుగానే ఇచ్చిన ప్రోగ్రామ్‌కు అనుగుణంగా పనిచేయడానికి పరిమితమయ్యే పరిస్ధితి రోబోలకు ఉండదు.

తాజా ప్రయోగంలో భాగంగా వండిన వంటకాలను వడ్డించేందుకు అనుగుణంగా డైనింగ్ టేబుల్‌ను సర్దడం వంటి పనులపై రోబోకు శాస్త్రవేత్తలు శిక్షణ ఇచ్చారు.దాదాపు 20 వేల సార్లు చేసిన ప్రయత్నాల్లో రోబో కేవలం ఆరు సార్లు మాత్రమే తప్పులు చేసిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

కప్పు, గ్లాసు, ఫోర్క్, కత్తి, డిన్నర్ ప్లేట్, చిన్నప్లేట్, గిన్నె లాంటి ఎనిమిది వస్తువులను వివిధ రకాలుగా టేబుల్‌పై ఎలా సర్దాలనే సమాచారంతో కూడిన డేటా సెట్‌ను శాస్త్రవేత్తలు రోబోకు కాన్‌ఫిగర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు