దుబాయ్ లో భారతీయుడికి 2ఏళ్ళ జైలు శిక్ష..నేరం తెలిస్తే షాక్ అవుతారు..!!

దేశం కాని దేశంలో బ్రతికే విదేశీయులు ఎవరైనా సరే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ఉండటం ఎంతో ఉత్తమం, లేదంటే ఆ దేశ కఠినమైన శిక్షలు రుచి చూడక తప్పదు.

ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకున్నాడు భారత సంతతికి చెందిన ఓ వ్యక్తీ.

అసలే ఒక తప్పు చేసి అడ్డంగా ఇరుక్కుపోయిన సదరు వ్యక్తి.వెంటనే మరో తప్పు చేస్తూ అడ్డగా దొర్కిపోయాడు దాంతో దుబాయ్ కోర్టు అతడికి రెండేళ్ళ శిక్షతో పాటు భారీ జరిమానా విధించింది.

వివరాలలోకి వెళ్తే.దుబాయ్ లో ఎన్నో ఏళ్ళ నుంచీ ఉంటున్న భారత సంతతి వ్యక్తిని ఓ దొంగతనం నేరం కింద అల్ రేఫ్ఫా పోలీస్టేషన్ కు తీసుకువచ్చి విచారణ చేపడుతున్నారు దుబాయ్ పోలీసులు.

ఈ సమయంలో విచారణ చేపడుతున్న అధికారికి భారత సంతతి వ్యక్తీ 2 లక్షల దిర్హామ్ లు ఆఫర్ చేశాడు.భారత కరెన్సీ తో పోల్చితే మొత్తం రూ.40 లక్షలు ఉంటుంది.ఈ పెద్ద మొత్తం తనకు ఇస్తానని ఈ కేసు నుంచీ తనను తప్పించాలని అధికారిని కోరాడు.దాంతో

Advertisement

భారతీయ వ్యక్తీ ఇచ్చిన ఆఫర్ తిరస్కరించిన అధికారి ఈ విషయాన్ని ఉన్నత అధికారులకు తెలియజేశాడు.దాంతో అసలు దొంగతనం లో ఇతడి హస్తం ఉందని పూర్తిగా నిర్ధారించుకున్న పోలీసులు లంచం ఇవ్వజూపిన కారణంగా మరో కేసును కూడా నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.ఓ అధికారినైన నాకే కేసు నుంచీ తప్పించుకునేందుకు లంచం ఇస్తానని అన్నాడని అధికారి కోర్టులో చెప్పడంతో భారత సంతతికి వ్యక్తికీ న్యాయస్థానం రెండేళ్ళ జైలు శిక్షను విధిస్తూ లంచం ఇవ్వ జూపిన సొమ్మును జరిమానాగా కట్టమని ఆదేశించింది.

అంతేకాదు అతడికి సహకరించిన మరో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు కూడా రెండేళ్ళ పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

Advertisement

తాజా వార్తలు