అమెరికాలో నేపాలీ యువతి దారుణహత్య .. పోలీసుల అదుపులో భారత సంతతి వ్యక్తి

అమెరికాలో నేపాలీ విద్యార్ధినిని దారుణంగా హత్య చేసిన కేసులో భారత సంతతి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

టెక్సాస్‌లోని( Texas ) హ్యూస్టన్‌లో 21 ఏళ్ల నేపాల్ విద్యార్ధిని మునా పాండే( Muna Pandey ) హత్య కేసులో 51 ఏళ్ల భారత సంతతి వ్యక్తి బాబీ సింగ్ షాను( Bobby Singh Shah ) అరెస్ట్ చేశారు.

హ్యూస్టన్ కమ్యూనిటీ కాలేజీలో నర్సింగ్ విద్యార్ధిని అయినా మునా పాండే వారాంతంలో తన అపార్ట్‌మెంట్‌లో తుపాకీ గాయాలతో చనిపోయింది.

న్యూయార్క్ పోస్ట్ నివేదికల ప్రకారం.నిఘా ఫుటేజీలు , ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు షాను పట్టుకున్నారు.పోలీసుల దర్యాప్తులో పాండే మరణానికి దారితీసిన కారణాలు వెలుగుచూశాయి.

సీసీ కెమెరా ఫుటేజ్‌లో షా తన తుపాకీతో మృతురాలు పాండేతో పోరాడుతున్నట్లుగా ఉంది.కొద్దిసేపటి తర్వాత అతను ఆమెను బలవంతంగా లోపలికి లాక్కెళ్లాడని పోలీసులు తెలిపారు.

Advertisement

గుర్తు తెలియని వ్యక్తులు అందించిన సమాచారంతో అపార్ట్‌మెంట్ సిబ్బంది పాండే మృతదేహాన్ని కనుగొన్నారు.

పాండే ఒంటరిగా ఉంటోందని.ఆమె తన అపార్ట్‌మెంట్ వెలుపల సెక్యూరిటీ కెమెరాను అమర్చమని పలుమార్లు కోరిందట.పదేళ్ల క్రితం షుగర్ డాడీ వెబ్‌సైట్‌లో షాతో పరిచయం ఏర్పడటంతో.

వార్తల్లో అతని ఫోటోను చూసిన ఓ మహిళ పోలీసులకు సమాచారం అందించింది.ఈ ఘటన అధికారులకు షా నేరచరిత్రను మరింత లోతుగా పరిశోధించడానికి దోహదపడింది.

ఆమె మరణానికి దారి తీసిన పరిస్ధితులు తెలుసుకోవడానికి మృతురాలి ఫోన్ కీలక ఆధారంగా పోలీసులు భావిస్తున్నారు.అందులో ఏదో ఒక లింక్ దొరుకుతుందని దర్యాప్తు అధికారులు ఆశిస్తున్నారు.

బాలీవుడ్ లో మెరవనున్న మరో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్...
యూకేలో భారత సంతతి బాలిక దారుణ హత్య.. తల్లే హంతకురాలు, ఎట్టకేలకు వీడిన మిస్టరీ

పాండే హత్య స్థానిక కమ్యూనిటీని దిగ్భ్రాంతికి గురిచేసింది.గడిచిన వారం రోజుల్లో హ్యూస్టన్‌లో( Houston ) చనిపోయిన రెండో విద్యార్ధిని మునాలే పాండే కావడం గమనార్హం.

Advertisement

అంతకుముందు మరో ఘటనలో రైస్ యూనివర్సిటీలో ఆండ్రియా రోడ్రిగ్జ్ అనుమానాస్పదస్థితిలో శవమై తేలింది.అయితే ఆమెది హత్యా, ఆత్మహత్యా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

తాజా వార్తలు