అమెరికా : హార్వర్డ్ యూనివర్సిటీ సీఎఫ్‌వోగా భారత సంతతి మహిళ..!!

ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ ఫైనాన్స్ అండ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ , వైస్ ప్రెసిడెంట్‌గా భారతీయ అమెరికన్ మహిళ రీతూ కల్రా( Ritu Kalra ) నియమితులయ్యారు.ఇన్వెస్ట్‌మెంట్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌లో ఆమెకు అపారమైన అనుభవం వుంది.

 Indian-origin Executive Ritu Kalra Appointed V-p, Finance & Cfo At Harvard U-TeluguStop.com

ఫైనాన్స్ అండ్ సీఎఫ్‌వో వైస్ ప్రెసిడెంట్‌గా రీతూ.హార్వర్డ్ యూనివర్సిటీలో( Harvard University ) ఆర్ధిక నిర్వహణ సహా అన్ని అంశాలను పర్యవేక్షించనున్నారు.

ఇందులో దీర్ఘ శ్రేణి ప్రణాళిక, వార్షిక బడ్జెట్, ఎండోమెంట్ ఫండ్ వ్యయ విధానం, ట్రెజరీ కార్యకలాపాలు, ఫైనాన్షియల్ అకౌంటింగ్ , రిపోర్టింగ్ వున్నాయి.తన పరిధిలోని 200 మందికి పైగా ఉద్యోగులతో హార్వర్డ్ యూనివర్సిటీకి ఆర్ధిక స్ధిరత్వం కల్పించేందుకు రీతూ కల్రా కీలక పాత్ర పోషించనున్నారు.2020లో హార్వర్డ్‌లో చేరిన నాటి నుంచి ఆమె తన నాయకత్వ సమర్థతను నిరూపించుకున్నారు.

Telugu Cfo Harvard, Goldman Sachs, Harvard, Ritu Kalra-Telugu NRI

హార్వర్డ్‌లో చేరడానికి మందు కల్రా.గోల్డ్ మెన్ సాచ్స్‌లో( Goldman Sachs ) 18 ఏళ్ల పాటు పలు హోదాల్లో విధులు నిర్వర్తించారు.ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్‌లో అమెరికావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలకు వ్యూహాత్మక సేవలను అందించారు.

వాతావరణం కారణంగా తలెత్తే నష్టాలను పరిష్కరించేందుకు వినూత్న ఫైనాన్సింగ్ వ్యూహాలను ఆమె రూపొందించారు.పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని ది వార్టన్ స్కూల్‌లో ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ఆమె పొందింది.

అలాగే న్యూయార్క్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నుంచి బిజినెస్ అండ్ ఎకనామిక్ రిపోర్టింగ్‌లో మాస్టర్స్ చేశారు రీతూ.

Telugu Cfo Harvard, Goldman Sachs, Harvard, Ritu Kalra-Telugu NRI

కాగా.కొద్దిరోజుల క్రితం భారత సంతతికి చెందిన పరిశోధకుడు విక్రమ్ పటేల్‌ హార్వర్డ్ మెడికల్ స్కూల్ అనుబంధ ‘‘ గ్లోబల్ హెల్త్ అండ్ సోషల్ మెడిసిన్’’ ( Global Health and Social Medicine )విభాగానికి కొత్త చైర్‌గా ఎంపికయ్యారు.ముంబైలో జన్మించిన ఆయన.హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లోని బ్లావత్నిక్ ఇన్‌స్టిట్యూట్‌లో గ్లోబల్ హెల్త్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.విక్రమ్ నియామకంపై గత వారం అధికారిక ప్రకటన వెలువడింది.

ఈ ఏడాది సెప్టెంబర్ 1న విక్రమ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.తన జీవితంలో మానసిక ఆరోగ్య సమస్యలు, సామాజిక ప్రతికూలతలు వంటి వాటికి చికిత్సను అందించడంపై ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు.

గ్లోబల్ హెల్త్ అండ్ సోషల్ మెడిసిన్ విభాగానికి చైర్‌గా వున్న పాల్ ఫార్మర్‌ గతేడాది ఫిబ్రవరిలో మరణించడంతో విక్రమ్‌ను ఈ పదవికి ఎంపిక చేశారు.ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మానసిక ఆరోగ్య సంక్షోభంపై అవగాహన పెరుగుతున్న సమయంలో విక్రమ్ పటేల్ నియామకం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube