మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.ఇందులో భాగంగా ముందుగా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు.
రూ.56 కోట్లతో 26 ఎకరాల్లో కలెక్టరేట్ నిర్మాణాన్ని పూర్తి చేశారు.అదేవిధంగా మంచిర్యాల – అంతర్గామ్ మధ్య రూ.165 కోట్లతో గోదావరిపై నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు.అనంతరం రూ.1,658 కోట్లతో చేపట్టే చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి ఆయన భూమి పూజ చేయనున్నారు.తరువాత మంచిర్యాల మెడికల్ కాలేజీతో పాటు ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేయనున్నారు.
అదేవిధంగా కులవృత్తులకు రూ.లక్ష ఆర్థిక సహాయంతో పాటు సొంతింటి స్థలం ఉన్నవారికి రూ.3 లక్షల ఆర్థికసాయం చేసే గృహాలక్ష్మీ పథకానికి కేసీఆర్ ఇక్కడ నుంచే శ్రీకారం చుట్టనున్నారు.