భారత్ కు చెందిన ప్రముఖ మహిళా శాస్త్రవేత్త సౌమ్య స్వామినాధన్ కు అరుదైన గౌరవం దక్కింది.ఆమె ప్రతిభను గుర్తించిన బ్రిటన్ ప్రభుత్వం కరోనా మహమ్మారి పై అలాగే భవిష్యత్తులో ఎలాంటి వైరస్ ల ప్రభావం వచ్చినా ఎదుర్కునేలా ఉండేందుకు నిపుణులతో కూడిన ఓ కమిటీలో మన స్వౌమ్య స్వామినాధన్ ను ఎంపిక చేసింది.
ఆమె అత్యంత ప్రతిభావంతురాలని, ఆమెకు ఉన్న అపారమైన అనుభవం తమ పరిశోధనలకు ఎంతో ఉపయోగపడుతుందని బ్రిటన్ తెలిపింది.
బ్రిటన్ ప్రభుత్వం తమ దేశం భవిష్యత్తులో ఎలాంటి వ్యాధులు వచ్చినా ఎదుర్కునేలా ఇప్పటి నుంచీ ప్రణాలికలు సిద్దం చేస్తోందట.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీలో సుమారు 20 మంది సభ్యులు ఉంటారని పీపీపీ (పాండమిక్ ప్రిపెర్డ్ నెస్) అనే పేరుతో ఏర్పాటయిన ఈ టీమ్ భవిష్యత్తు లో రాబోయే వ్యాధులపై పరిశోధనలు జరిపి వారికి పరిష్కారా మార్గాలను సూచిస్తుందని తెలిపింది ప్రభుత్వం.తాజాగా భేటీ అయిన ఈ బృందం సభ్యులు భవిష్యత్తులో ప్రజలు ఎలాంటి రోగాల, వైరస్ ల బారిన పడకుండా ఉండేందుకు చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది.
ఇలాంటి కమిటిలో మన భారత శాస్త్రవేత్తకు చోటు దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు భారతీయులు.
శిశు సంభందిత వైద్యంలో నిపుణులుగా పేరు తెచ్చుకున్న సౌమ్య స్వామినాధన్ క్షయ, హెచ్ఐ వి రోగాలపై ఎన్నో పరిశోధనలు చేశారు.
ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న సౌమ్య స్వామినాధన్ పుట్టింది చెన్నై లో.ఇంతకీ సౌమ్య స్వామినాధన్ ఎవరో కాదు భారత జాతి గర్వించదగ్గ వ్యక్తి దేశంలో గ్రీన్ రివల్యుషన్ చేపట్టి విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఏమ్ ఎస్ స్వామినాధన్ కుమార్తె.ప్రస్తుతం ఆమె పలు కీలక పదవులు చేపడుతున్న నేపధ్యంలో బ్రిటన్ ప్రభుత్వం కోరిక మేరకు పీపీపీ కమిటిలో సభ్యురాలిగా చేరి సేవలు అందిస్తున్నారు.