నాకు గ్రీన్ కార్డ్ దక్కుతుందా .. భారత సంతతి సీఈవో ఆందోళన, ఎలాన్ మస్క్ రియాక్షన్

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా( America ) వెళ్తున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

వీరిలో చాలా మంది లక్ష్యం అక్కడే శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం.

దీనికి అవసరమైన గ్రీన్‌కార్డ్‌ను( Green Card ) ఎంత వీలైతే అంత త్వరగా పొందడానికే ఎక్కువ మంది చూస్తారు.కానీ ప్రస్తుతం అన్ని దేశాల నుంచి అమెరికాకు వలసలు పెరగటంతో గ్రీన్‌కార్డ్ రావడం కష్టమైంది.

విపరీతమైన డిమాండ్ నేపథ్యంలో అగ్రరాజ్యం 7 శాతం నిబంధన తీసుకొచ్చింది.దీని ప్రకారం అమెరికా ప్రతి ఏడాది మంజూరు చేసే మొత్తం గ్రీన్ కార్డుల్లో ఒక్కో దేశానికి 7 శాతం దక్కుతాయి.

చిన్న దేశాలకు ఈ విధానం సౌలభ్యంగా ఉన్నప్పటికీ.భారత్, చైనా వంటి పెద్ద దేశాలకు దీని కింద వచ్చే వీసాలు( Visa ) ఏమూలకు చాలడం లేదు.

Advertisement

నిపుణులు చెబుతున్న దానిని బట్టి భారతీయులకు ప్రస్తుత పరిస్ధితుల్లో గ్రీన్ కార్డ్ లభించాలంటే దాదాపు 195 ఏళ్ల పాటు వేచి చూడాలి.అయితే ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ కోసం దాదాపు 5 లక్షల మంది భారతీయులు దరఖాస్తు చేసుకున్నారని అంచనా.

అగ్రరాజ్యంలో భారతీయులు కీలక స్థానాల్లోకి చేరుకుంటున్నప్పటికీ.శక్తివంతమైన లాబీ వ్యవస్థ ఉన్నప్పటికీ, వీసాలు, గ్రీన్‌కార్డ్ విషయంలో మాత్రం ఇండియన్స్‌కి పట్టు దొరకడం లేదు.

తాజాగా భారతీయులకు గ్రీన్‌కార్డ్‌ ఆలస్యంపై భారత సంతతికి చెందిన అమెరికన్ కంపెనీ Perplexity సీఈవో అరవింద్ శ్రీనివాస్( CEO Aravind Srinivas ) - టెస్లా అధినేత ఎలాన్ మస్క్( Elon Musk ) మధ్య సోషల్ మీడియాలో జరిగిన సంభాషణ చర్చనీయాంశమైంది.మూడేళ్ల క్రితం తాను గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేశానని.దాని స్థితిని మెరుగుపరచుకోవడానికి సలహా ఇవ్వాల్సిందిగా మస్క్‌ను శ్రీనివాస్ కోరారు.

ఇంతకీ నాకు గ్రీన్ కార్డు వస్తుందా అంటూ ప్రశ్నించారు.

మంచు వారింట మొదలైన చక్కెర లొల్లి... చంపడానికే కుట్ర... మనోజ్ సంచలన వ్యాఖ్యలు!
సైబీరియన్ పులి ప్రేమ ప్రయాణం.. 200 కి.మీ దాటి, ప్రేయసి చెంతకు!

దీనిపై స్పందించిన స్పేస్ ఎక్స్ అధినేత.అత్యంత ప్రతిభావంతులు చట్టబద్ధంగా అమెరికాకు రావడానికి కొన్ని వ్యవస్ధలు అడ్డుపడుతున్నాయని అన్నారు.కానీ నేరస్థులు చట్టవిరుద్ధంగా ఇక్కడికి వస్తున్నారని దీనిని డీవోజీఈ పరిష్కరిస్తుందని ఎలాన్ మస్క్ హామీ ఇచ్చారు.

Advertisement

ఇక అరవింద్ శ్రీనివాస్. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్ధి.

కాలిఫోర్నియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసిన ఆయన ఓపెన్ఏఐ, గూగుల్, డీప్ మైండ్ వంటి ప్రఖ్యాత సంస్థలలో పనిచేశారు.

తాజా వార్తలు