భారతదేశపు సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తత గా ఉన్నాయి.సరిహద్దుల్లో చైనా మరియు భారత్ ఇరువర్గాల మధ్య భారీ మోహరింపులు జరుగుతున్నాయి.
శీతాకాల సమయంలో భారత్ వెనక్కి తగ్గుతుందని చైనా భావించింది, అయితే దీనికి భారత్ ధీటుగా సమాధానం చెప్తుంది.ఇందుకోసం సరిహద్దుల్లో భద్రత పెంచింది.
దేశ రక్షణ కోసం తాము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని, ఎలాంటి గందరగోళానికి తావు ఇవ్వమని ఆర్మీ అంటుంది.మోడీ ప్రభుత్వం లోని భారత సైన్యం ఎప్పుడు లేనంత సమతూకంగా ఉంది.
పొరుగు దేశాల నుండి ఎటువంటి ముప్పు వచ్చినా దాన్ని ఎదురుక్కోవడానికి సిధంగా ఉంది.
ఇందులో భాగంగానే భారత సైన్యం కోసం ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సరికొత్త డీజిల్ ను ప్రవేశపెట్టింది.
దాన్ని వింటర్ డీజిల్ గా పిలుస్తున్నారు.అయితే భారత సైన్యం మంచులో పనిచేస్తుంది అనే విషయం మన అందరికి తెలిసిందే.
ఈ ఉష్ణోగ్రతలో వాహనాలకు రెగ్యులర్ గా వాడే డీజిల్ వాడితే వాహనాలు పనిచేయవు, ఇందుకోసం ఆర్మీ వాహనాలకు DHPP-W అనే ప్రత్యేక ఇంధనం వాడుతారు.ఇపుడు ఆ స్థానం లో వింటర్ డీజిల్ ను ప్రవేశపెట్టారు.