దుబాయ్ లో భారత ఎన్నారై కి భంపర్ లాటరీ..

ఎన్నో దేశాల నుంచీ ఎంతో మంది వలస జీవులు దుబాయ్ వంటి దేశాలకి అధిక డబ్బుని సంపాదించడానికి వెళ్తూ ఉంటారు.ఈ క్రమంలోనే తమ భార్యా పిల్లలకి దూరంగా ఉంటూ వారు అభివృద్ధి కోసం దేశం కాని దేశంలో ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటారు అయితే ఇలా భారత్ నుంచీ దుబాయ్ వెళ్ళిన గుర్మీత్ సింగ్ అనే వ్యక్తి , వివిధ దేశాల నుంచీ వచ్చిన మరో 9 మంది కలిసి.

దుబాయ్ లో ఒకే ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు.అయితే గుర్మిత్ సింగ్ ఎప్పటి నుంచో దుబాయ్ ల దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలీనీర్ అండ్ ఫైనెస్ట్ లో లాటరీ టిక్కట్టు కొనుగోలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకునే వాడు అయితే ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఈ సారి తన సహచరులతో కలిసి ఒక టిక్కెట్టు కొనుగోలు చేశాడు.అయితే

ఈ సారి ఈ సంస్థ తీసిన లాటరీ ఫలితాలలో గుర్మీత్ సింగ్ ,అతని స్నేహితులు కలిసి కొన్ని టిక్కెట్టుకు లక్కీ డ్రా లో గెలుపొందింది.తాము సంపాదించిన కొద్ది మొత్తంలో లాటరీ టికెట్ కొనుగోలు కోసం దాచిపెట్టారు.దాంతోనే గుర్మిత్ టిక్కెట్టు కొనుగోలు చేశాడు.

మంగళవారం డ్రా తీయడంతో గుర్మీత్ కొనుగోలు చేసిన టికెట్‌కు లాటరీ దక్కింది.దీంతో 10 మంది వలసజీవులకు 1 మిలియన్ డాలర్లు దక్కాయి.

అంటే దాదాపు 7 కోట్లకి పైమాటే దీంతో ఆ వలస జీవుల కుటుంభాలలో సంతోషం వెళ్లి విరుస్తోంది.

Advertisement
అందంగా పుట్టడమే ఈ మోడల్ తప్పయింది.. ఫ్రెండ్స్ ఏం చేశారో తెలిస్తే..
Advertisement

తాజా వార్తలు