దుబాయ్ నౌకలో 9 నెలలుగా నరకం చూస్తున్న..భారతీయులు

దుబాయ్ సముద్ర జలాలలోకి లో పనామాకి చెందిన ఒక నౌక వచ్చి చేరింది ఆ నౌకలో సుమారు 8 మంది భారతీయులు కొన్ని నెలలు పాటు ఎన్నో కష్టాలని ఓర్చుకుంటూ ఆ నౌకలోనే జీవనం సాహిస్తున్నారు.ఈ కధనాన్ని గల్ఫ్‌ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది దాంతో ఈ వార్త అంతటా వ్యాపించింది వివరాలలోకి వెళ్తే.

 Indian Nri Fishermans Facing Problems At Panama Boat In Dubai-TeluguStop.com

ఎనిమిది మంది భారత నావికులు దాదాపు తొమ్మిది నెలల పాటు ఓ నౌకలోనే ఉంటూ ఎన్నో కష్టాలు పడుతున్నారు పనామాకు చెందిన నౌక గత నవంబరులో దుబాయ్‌ సముద్ర జలాల్లోకి ప్రవేశించిన ఈ నౌకలో భారత నావికులకు ఉన్నారు అయితే వారికి సరిపడినంత ఆహారం, ఇంధనం ఇవ్వకుండా సముద్రంలోనే సదరు నౌకా యజమానులు వదిలేశారు.అంతేకాదు వారికి పూర్తి వేతనం కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది.

అయితే ఆ భారతీయులు దుబాయ్ వచ్చినప్పటి నుంచి ఒక నెల జీతం మాత్రమే ఇచ్చారని, సరిపడినంత ఆహారం, తాగునీరు సరఫరా చేయడం లేదని నౌకలోని సిబ్బంది తెలిపారు.వారికి ఏమి చేయాలో తెలియక తీవ్ర ఆవేదనకీ లోనవుతున్నారని న్యూస్ ఏజెన్సీ తెలిపింది.మా కుటుంబాలు మేము తిరిగి ఎప్పుడొస్తామని తీవ్ర ఆందోళన చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

తమని వెంటనే స్వదేశానికి పంపేందుకు చర్యలు తీసుకోవాలని ఎంతోమంది అధికారులను ప్రాధేయపడ్డా లాభం లేకుండా పోయిందనివారు గోడు వెళ్ళబోసుకుంటున్నారు.అయితే ఈ విషయంపై నౌక యజమానితో సంప్రదింపులు జరుపుతున్నామని దుబాయ్‌లోని భారత కాన్సులేట్‌ వెల్లడించింది.త్వరలోనే వారిని తమ స్వగ్రామానికి పంపే ఏర్పారు చేస్తామని కాన్సులేట్ వెల్లడించింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube