సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన భారతదేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచార నియమాలు ఉంటాయి.అలాగే కేరళలోని శబరిమలై అయ్యప్పస్వామి ఆలయంలో మహిళలకు ప్రవేశం లేదన్న విషయం తెలిసిందే.
ఋతుక్రమంలో ఉన్న మహిళలు తప్ప ఎవరైనా ఈ ‘మణికంఠ’ స్వామిని సందర్శించుకునే సౌలభ్యం ఉంది.ఈ విషయంపై సుప్రీమ్ కోర్ట్ కొత్త ఆదేశాలు జారీ చేసింది.
ఆలయం అనేది ప్రజలకోసం ఏర్పాటు చేసినదని… అలాంటప్పుడు కేవలం పురుషులనే అనుమతించి స్త్రీలకు అనుమతి ఎందుకు నిరాకరిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది.ఇలా చేయడమంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనంటూ వ్యాఖ్యానించింది.ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ రోహిన్టన్ ఫాలి నారిమన్, జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్ సింగ్, ఇందు మల్హోత్రలతో కూడిన ధర్మాసనం కేవలం మహిళలు అయినందువల్లే వారికి ఆలయంలోకి అనుమతి లేదా లేక ఇతరత్ర కారణాలేమైనా ఉన్నాయా అంటూ విచారణ చేసింది.గత 800 ఏళ్లుగా ఉన్న సంప్రదాయం ఇకపై మారనుంది అని పిటిషన్ దాఖలు చేసిన ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది.
అయితే ఈ విషయంపై కొందరు నెటిజెన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కొందరైతే మరొక గుడి అందులో మహిళలకు ప్రవేశం అనుమతి చేయండి.
అంతేకాని ఈ గుడి పవిత్రతను పాడు చేయకండి అంటూ కామెంట్ చేసారు.
వారికి ఓ మహిళ ఇచ్చిన సమాధానం ప్రతి ఒక్కరు తప్పక చదవాలి…అదేంటో మీరే చూడండి!
“ఓ అంటరానితనపు అవయవం ఇచ్చిన అమాయక బాలా! మరి నీ పుట్టుకెలా పవిత్రం?
తినే తిండిని కూడా ఆమె స్పర్శే అపవిత్రం చేయగలిగితే నీ నరనరాల్లో నిండిన అమ్మతనపు రక్తమే నిన్ను అపవిత్రం చేసిందని చచ్చిపో తరతరాల అణచివేతలతో అవమానభారం చీల్చేసిన ఎండోమెట్రియంల రొద ,మనిషితనం ఇంకా మిగులుంటే విను! “
.