ఏదైతే జరగకూడదని తెలంగాణ నుంచి ఆంధ్రాకు ఆగమేఘాల మీద షిఫ్ట్ అయిపోయాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.ఇక అప్పటి నుంచి సైలెంట్ గా తన పని ఏదో తాను చేసుకుంటూ వెళ్తున్నాడు.
అప్పట్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో బాబు బుక్కయిపోయాడని ఇక జైలుకి వెళ్లక తప్పదని అంతా భావించారు.కానీ ఏవో రాజకీయాలు నడవడంతో ఆ వ్యవహారం కాస్తా సర్దుమణిగిపోయింది.
అయితే బీజేపీతో సున్నం పెట్టుకోవడం.తెలంగాణాలో టీఆర్ఎస్ ను ఓడించేందుకు మహా కూటమితో కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతుండడంతో మళ్ళీ ఈ వ్యవహారం మొదటికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరిన చంద్రబాబు ప్రియ శిష్యుడు రేవంత్ పీకల్లోతు కేసుల్లో మునిగిపోయాడు.ఈ నేపథ్యంలో ఇక నెక్స్ట్ టార్గెట్ చంద్రబాబు అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
రేవంత్ అసలు రాజకీయ చరిత్ర అంతా తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉంది.అసలు తెలుగుదేశంలోనే రేవంత్ కెరీర్ సర్వనాశనం అయ్యింది.ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడమే లోకేష్ కెరీర్ ను దెబ్బ కొట్టింది.అప్పుడే రేవంత్ జైలుకు వెళ్లాడు.ఇలాంటి నేపథ్యంలో.ఇప్పుడు రేవంత్ పై తీవ్రమైన కేసులు చుట్టుముట్టాయి.
భారీగా అక్రమాస్తులు అనే మాట వినిపిస్తోంది.విదేశాల్లో అక్రమాస్తులు దాచాడని.
సింగపూర్లో భారీగా అక్రమాస్తులున్నాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
రేవంత్ ఆర్థిక వ్యవహారాల్లో ఆయన అరెస్టు కావొచ్చనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.రానున్న వారం పది రోజుల్లోపు రేవంత్ అరెస్టు జరిగినా జరగొచ్చు.రేవంత్ రెడ్డి వ్యవహారంలో చంద్రబాబు ఇరుక్కొనే అభిప్రాయాలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
అందులో ముఖ్యమైనది ఓటుకు నోటు కేసు.ఈ కేసులో ఈడీ విచారణ జరిగితే అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రమేయం గురించి కూడా విచారణ జరాగాల్సి రావొచ్చు.
ఓటుకు నోటు కేసు ఇప్పటికీ చంద్రబాబు గుండెళ్ల రైళ్లను పరిగెట్టిస్తోంది.తనను ఓటుకు నోటు కేసులో మూసేస్తారేమో అని చంద్రబాబు నాయుడు మొదటి నుంచి భయపడుతున్నాడు.
అందుకే తెలంగాణలో ప్రచారానికి కూడా రాను అని తేల్చేశాడు.ఇన్ని చేసినా బాబు ఈ కేసులో ఇరుక్కోక తప్పదన్నట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి.