వామ్మో.. ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం.. ఎంతమందంటే?

సాధారణంగా ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటారనే ప్రశ్న ఎదురైతే కుటుంబాన్ని బట్టి ఒక్కరి నుంచి 25 మంది దాకా ఉండే అవకాశం ఉంటుంది.

మారుతున్న కాలంతో పాటే ప్రస్తుతం చిన్న కుటుంబాలకు ప్రాధాన్యత పెరుగుతోంది.

దేశంలో అరుదుగా మాత్రమే ఉమ్మడి కుటుంబాలు కనిపిస్తున్నాయి.ఏదైనా

ప్రత్యేక వేడుక

జరిగితే మాత్రమే వేర్వేరుగా ఉన్న కుటుంబాలు ఒకేచోటకు చేరే అవకాశం ఉంటుంది.

అయితే మిజోరాంలో మాత్రం ఏకంగా ఒకే కుటుంబంలో 181 మంది ఉన్నారు.ఈ కుటుంబం ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం కావడం గమనార్హం.

ఈ అరుదైన ఘనతను భారతదేశానికి చెందిన వ్యక్తి సొంతం చేసుకోవడం గమనార్హం.ఈ కుటుంబం గురించి ఈ కుటుంబ సభ్యుల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం మాత్రం గ్యారంటీ.

Advertisement

ఇంత భారీ కుటుంబం దేశంలోని మిజోరాంలోని బాట్వాంగ్ గ్రామంలో ఉంది.

బాట్వాంగ్ లో జియోనా చానా వ్యక్తి ఉన్నాడు.సాధారణంగా ఒక మనిషికి ఒకరు లేదా ఇద్దరు భార్యలు ఉంటారు.అయితే ఆ వ్యక్తి మాత్రం ఏకంగా 39 మందిని వివాహం చేసుకున్నాడు.

జియోనాకు 39 మంది భార్యలకు 94 మంది జన్మించారు.జియోనాకు మనవళ్లు, మనవరాళ్లు కూడా ఉన్నారు.వీళ్లంతా నేటికీ ఒకే ఇంట్లో నివశిస్తుంటారు.100కు పైగా గదులు ఉండే ఇంటిని నిర్మించిన జియోనా సాధారణ వడ్రంగి కావడం గమనార్హం.ఈ ఇంట్లోని మహిళలు పొలాల్లో పని చేయడంతో పాటు కలిసే ఇంటి పనులను చేసుకుంటారు.

కుటుంబ సభ్యుల కోసం ఇంట్లో మహిళలంతా కలిసి రోజుకు రెండుసార్లు వంట వండుతారు.ఈ కుటుంబానికి రోజుకు 60 కిలోల కూరగాయలు, 45 కేజీల బియ్యం, 25 కేజీల పప్పు, 20 కేజీల పండ్లు అవసరం.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

ఈ కుటుంబంలో విబేధాలు, అసూయ అస్సలు లేకపోవడం గమనార్హం.పుట్టినరోజు వేడుకల విషయంలో వీళ్లకు పెద్దగా పట్టింపులు ఉండవు.

Advertisement

తాజా వార్తలు