యూఎస్ రెస్టారెంట్‌లో చేదు అనుభవం.. బలవంతంగా రూ.420 టిప్ కట్టించారు..?

అమెరికాలోని చాలా రెస్టారెంట్లలో, వెయిటర్‌లు లేదా వెయిట్రెస్‌లకు వారి సర్వీసుకు గుర్తుగా కొంత మొత్తం ఇవ్వడం కామన్.దీన్నే టిప్పింగ్( Tipping ) అంటారు.

అయితే ఇటీవల ఒక బెంగళూరు వ్యక్తి అమెరికాలోని ఒక న్యూయార్క్ రెస్టారెంట్‌లో( Newyork Restaurant ) తిన్న భోజనానికి 50 డాలర్లు ఇచ్చాడు.నిజానికి అతడి బిల్లు 45 డాలర్లు అయింది.50 డాలర్లు ఇచ్చిన తర్వాత ఐదు డాలర్లు తిరిగి ఇస్తారేమో అని అనుకున్నాడు.కానీ, ఆయనకు 5 డాలర్లు (సుమారు రూ.420) చేంజ్ ఇవ్వలేదు.వెయిటర్( Waiter ) ఆ మిగిలిన డబ్బును టిప్‌గా తీసుకున్నారు.

ఈ బెంగళూరు వ్యక్తి పేరు ఇషాన్ శర్మ.( Ishan Sharma ) యూట్యూబ్ వీడియోలు చేస్తుంటాడు.

అతడు యూఎస్ రెస్టారెంట్‌లో తన దగ్గర నుంచి బలవంతంగా టిప్ తీసుకున్నట్టు ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో తెలిపాడు.

Advertisement

ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.చాలామంది ఈ టిప్పింగ్ వ్యవస్థను అన్యాయమని అంటున్నారు.కొందరు మాత్రం, వెయిటర్‌ల జీతాలు తక్కువగా ఉండటం వల్ల టిప్పింగ్ అనేది అవసరం అని వాదిస్తున్నారు.

ఇషాన్ శర్మ సోషల్ మీడియా పోస్ట్‌లో అక్కడ జరిగిన కన్వర్జేషన్ గురించి తెలిపాడు.టిప్పు కంపల్సరీ ఇవ్వాలా అని అడిగితే ఆ వెయిట్రెస్‌ తనకు కనీసం ఆన్సర్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయిందని అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తన స్నేహితుడు (స్థానికుడు) తాను ఇలా అడగడం చూసి చాలా ఇబ్బంది పడ్డాడట."నా ఫ్రెండ్ కనీసం 20% టిప్ ఇవ్వకపోతే తప్పు చేసినట్లు భావించాడు!" అని మరింత వివరించాడు.

"అసలు 20% ఎందుకు కట్టాలి?" అని ఈ యువకుడు ప్రశ్నిస్తూ, టిప్పింగ్ వ్యవస్థను "ఇన్‌సేన్"గా అభివర్ణించారు.

అన్ స్టాపబుల్ సీజన్4 అతిథుల జాబితా ఇదే.. ఈ సెలబ్రిటీల పేర్లు వింటే షాకవ్వాల్సిందే!
జీతం రూ.1 కోటి వస్తుందట.. ముంబైకి రావచ్చా అని అమెరికన్ ప్రశ్నిస్తున్నాడు?

ఆ పోస్ట్‌ను ఆగస్టు 20న పంచుకున్నప్పటి నుంచి, దానికి 5.6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.అనేక కామెంట్స్ వచ్చాయి.అమెరికా గురించి నాకు తెలియదు, కానీ టిప్స్ కృతజ్ఞతగా ఇవ్వాలి, బలవంతంగా కాదు అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.15-20% టిప్ ఇవ్వడం అమెరికాలో కామన్ సోషల్ ప్రాక్టీస్. రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్ల వలె ప్రవర్తించాలి.

Advertisement

టిప్పింగ్ తప్పు అని మీకు బలంగా అనిపిస్తే, సిట్-డౌన్ రెస్టారెంట్‌లో ఆహారం ఆర్డర్ చేయకండి అని ఇంకొకరు అన్నారు."మీరు కేవలం 10% టిప్ ఇచ్చి తప్పించుకున్నారు.

ఈ రోజుల్లో కనీసం 15-20% లేదా అంతకంటే ఎక్కువ టిప్ ఇవ్వడం సాధారణం అయింది" అని మరొకరు చెప్పారు.

తాజా వార్తలు