దీపావళి వేడుకలు : వైట్‌హౌస్ ఇన్విటేషన్‌ తిరస్కరించిన రూపి కౌర్ .. ఇండియన్ కమ్యూనిటీ స్పందన ఇదే

భారతీయ పర్వదినం ‘‘దీపావళి’’ వేడుకలు ప్రతియేడు లాగానే ఈ సంవత్సరం కూడా అమెరికాలో ఘనంగా జరుగుతున్నాయి.

ఈ వారం ప్రారంభంలో భారత సంతతికి చెందిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్( Kamala Harris ) వాషింగ్టన్‌లోని తన అధికార నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.దీపావళి చుట్టూ ఇంతటి ఉత్సాహ వాతావరణం వుండగా.

ఈసారి కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.భారత సంతతికి చెందిన రచయిత్రి రూపి కౌర్.

తాను దీపావళి వేడుకల్లో పాల్గొనబోనని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ పంపిన ఆహ్వానాన్ని తిరస్కరించారు.గాజాపై ఇజ్రాయిల్( Israel ) దాడికి మద్ధతు ఇచ్చినందుకు గాను ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

ఇకపోతే.అమెరికా ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయిలలో దీపావళి పండుగకు నానాటికీ ప్రాధాన్యత పెరుగుతోందన్నారు ఏఏపీఐ విక్టరీ ఫండ్ ఛైర్మన్ శేఖర్ నరసింహన్( AAPI Victory Fund Chairman Shekhar Narasimhan ) .ఆయన 2009లో వైట్‌హౌస్‌లో తొలిసారి జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్‌హౌస్‌లో దీపం వెలిగించగా.

శ్రీ శివ విష్ణు ఆలయానికి చెందిన పూజారి స్టేట్ రూమ్‌లో వేద మంత్రాలు జపించారు.అప్పటి నుంచి వరుసగా అమెరికా అధ్యక్షులు, రాష్ట్రాల గవర్నర్‌లు దీపావళిని అధికారికంగా జరుపుకుంటూ వస్తున్నారని శేఖర్ గుర్తుచేశారు.

అయితే ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న రెండు యుద్ధాల కారణంగా వాషింగ్టన్ డీసీలో( Washington DC ) దీపావళి వేడుకలు తగ్గిస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.అమెరికాలోని మారుమూల ప్రాంతంలో నివసించే సగటు వ్యక్తికి కూడా ఇప్పుడు దీపావళి గురించి తెలుసునన్నారు ఇండియాస్పోరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ జోషిపురా.

ఈ ఏడాది దీపావళి వేడుకలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని, న్యూయార్క్ నగరంలో హైలైట్ కానున్నాయని ఆయన చెప్పారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జీవన్ రెడ్డి మాల్ రీ ఓపెన్
చంద్రకాంత్ మరణం పై నటుడు నరేష్ షాకింగ్ కామెంట్స్.. నా పరిస్థితి అదేనంటూ?

మరోవైపు.రూపి కౌర్ నిర్ణయంపై థింక్ ట్యాంక్ ఇమాంగిండియా ఇన్‌స్టిట్యూట్ అధ్యక్షుడు రాబిందర్ సచ్‌దేవ్( Rabinder Sachdev ) స్పందించారు.గ్లోబల్ ఇండియన్ డయాస్పోరాలోని ఏ వ్యక్తి అయినా సరే వైట్‌హౌస్ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించడం ఇదే తొలిసారని చెప్పారు.

Advertisement

ఆమె నిర్ణయం వల్ల భారతీయ అమెరికన్ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపదని సచ్‌దేవ్ స్పష్టం చేశారు.శ్వేతసౌధం విధానాలతో ఏకీభవించనట్లయితే అధ్యక్షుడి ఆహ్వానాన్ని తిరస్కరించేంత అధికారం ఉన్నత స్థాయి వ్యక్తులకు వుందని భావించడం సమాజంలో పెరుగుతున్న ఆత్మవిశ్వాసంగానూ భావించవచ్చని ఆయన పేర్కొన్నారు.

తాజా వార్తలు