అమెరికాలో భారతీయుడిపై దాడి.. విచక్షణారహితంగా కత్తిపోట్లు, ‘విద్వేషనేరం’గా అనుమానం

గడిచిన రెండు మూడు వారాలుగా అమెరికాలో భారతీయులు విద్వేష దాడులకు గురవుతున్న సంగతి తెలిసిందే.డల్లాస్‌లోని ఓ రెస్టారెంట్ పార్కింగ్ ఏరియాలో ఎస్మలార్డా ఆప్టన్ అనే మహిళ భారత సంతతి మహిళలను అసభ్యపదజాలంతో దూషించడంతో పాటు దాడికి దిగింది.

 Indian-american Uber Eats Delivery Boy Attacked In Newyork , Indian-american, Ub-TeluguStop.com

ఈ ఘటన మరిచిపోకముందే.కాలిఫోర్నియా రాష్ట్రంలో మరో విద్వేషదాడి జరిగింది.

అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే .బాధితుడు, నిందితుడు ఇద్దరూ భారతీయులే కావడం.

 Indian-American Uber Eats Delivery Boy Attacked In NewYork , Indian-American, Ub-TeluguStop.com

అయితే అమెరికన్లు అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ భారతీయులతో పాటు విదేశీయులను టార్గెట్ చేస్తున్నారు.భౌతికదాడులతో పాటు జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తున్నారు.పోలండ్ పర్యటనకు వచ్చిన ఓ అమెరికన్ టూరిస్ట్ భారతీయుడిపై విద్వేషం వెళ్లగక్కాడు.తాజాగా భారత సంతతికి చెందిన ఫుడ్ డెలివరీ బాయ్‌పై అమెరికాలో దుండగుడు కత్తితో దాడి చేశాడు.

వివరాల్లోకి వెళితే.బాధితుడిని భారత్ భాయ్ పటేల్‌గా గుర్తించారు.

ఇతను న్యూయార్క్ నగర శివార్లలోని క్వీన్స్‌లో తన కుటుంబంతో నివసిస్తున్నాడు.ఉబేర్ ఈట్స్‌లో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఈ క్రమంలో మంగళవారం ఎప్పటిలాగే తన విధుల్లో భాగంగా లోయర్ ఈస్ట్ సైడ్ ప్రాంతం నుంచి ఫుడ్ ఆర్డర్ రావడంతో డెలివరి ఇవ్వడానికి భారత్ అక్కడికి వెళ్లాడు.అయితే మార్గమధ్యంలో ఓ వ్యక్తి పటేల్‌ను అడ్డుకుని రెప్పపాటులో తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడికి దిగాడు.

అతను రక్తపుమడుగులో కిందపడిపోగానే.భారత్ పటేల్ బైక్ తీసుకుని నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.

రోడ్డుపై పదుల సంఖ్యలో జనం వున్నప్పటికీ.భారత్ పటేల్‌కు ఏ ఒక్కరూ సాయం చేయలేదు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని 47 ఏళ్ల కూపర్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు.అయితే నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లుగా పోలీసుల విచారణలో తేలింది.మరోవైపు దీనిని జాతి విద్వేష దాడిగా స్థానిక ఇండియన్ కమ్యూనిటీ ఆరోపిస్తోంది.ఈ ఘటనకు బాధ్యుడైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని భారతీయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube