అప్పుడే ఓటీటీలోకి వస్తున్న బ్రహ్మాస్త్ర.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

గత కొన్ని రోజుల నుంచి బాలీవుడ్ చిత్ర పరిశ్రమ వరుస ఫ్లాప్ సినిమాలను చవి చూస్తూ ఎంతో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది.అయితే బ్రహ్మాస్త్ర సినిమా కాస్త బాలీవుడ్ ఇండస్ట్రీకి ఊరటనీచ్చిందని చెప్పాలి.

 Ranbir Kapoor Alia Bhatt Brahmastra Ott Streaming Details,brahmastra ,ott..,stre-TeluguStop.com

బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ అలియా భట్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ 9వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అన్ని భాషలలోనూ మంచి కలెక్షన్లను రాబట్టి ఏకంగా 400 కోట్ల క్లబ్లో చేరింది.ఇకపోతే ఈ సినిమాలో అమితాబచ్చన్ నాగార్జున వంటి సెలబ్రిటీలు కీలక పాత్రలలో నటించారు.

ఇక ఈ సినిమాని తెలుగులో దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో విడుదల చేశారు.సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి విశేష స్పందన లభించింది.

ఇలా థియేటర్లో విడుదలైన ఈ సినిమా ఎంతో మంచి విజయం అందుకోవడంతో ఇక ఈ సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ఈ సినిమా విడుదల కావడంతో విడుదలైన నెల రోజులకే ఈ సినిమాని డిజిటల్ మీడియాలో ప్రసారం చేయడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Alia Bhatt, Amitab, Brahmastra, Brahmastra Ott, Ayan Mukerji, Disney Hot,

ఈ సినిమాని అక్టోబర్ మూడవ వారంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.అయితే త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకట వెలబడునున్నట్లు తెలుస్తోంది.థియేటర్లో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ సినిమా ఓటీటీలో ఏ విధమైనటువంటి ఆదరణ సంపాదించుకుంటుందో తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానునట్లు మనకు తెలిసిందే.త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube