అమెరికా : కనెక్టికట్‌ సిటీ కౌన్సిల్‌లోకి అడుగుపెట్టనున్న తొలి సిక్కు వ్యక్తి

అమెరికాలోని సిటీ కౌన్సిల్స్‌కి జరిగిన ఎన్నికల్లో ఇండో అమెరికన్లు సత్తా చాటుతున్నారు.

అమెరికాలోని అతిపెద్ద నగరం, దేశ వాణిజ్య రాజధాని న్యూయార్క్ సిటీ కౌన్సిల్‌ ఎన్నికల్లో దక్షిణాసియా వాసులు చరిత్ర సృష్టించారు.

ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్ న్యాయవాది శేఖర్ కృష్ణన్, బంగ్లాదేశ్- అమెరికన్ షహానా హనీఫ్‌‌లు న్యూయార్క్ సిటీ కౌన్సిల్‌కు ఎన్నికైన తొలి దక్షిణాసియా వాసులుగా రికార్డుల్లోకెక్కారు.అంతేకాదు ఈ ఎన్నికల్లో గెలిచిన తొలి ముస్లిం మహిళగా హనీఫ్ మరో అరుదైన గౌరవం పొందారు.

అలాగే ఇండో టిబెటెన్ జాతీయుడు అఫ్తాబ్ పురేవాల్ ఒహియో రాష్ట్రంలోని సిన్సినాటి నగరానికి మేయర్‌గా ఎన్నికయ్యాడు.తద్వారా ఈ పదవికి ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తిగా అప్తాబ్ రికార్డు సృష్టించాడు.

తాజాగా డెమొక్రాటిక్ పార్టీకి చెందిన స్వరంజిత్ సింగ్ నవంబర్ 2న కనెక్టికట్ రాష్ట్రంలోని సిటీ కౌన్సిల్‌కు ఎన్నికైన తొలి సిక్కు వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు.కనెక్టికట్‌లోని నార్విచ్‌లో 10 సిక్కు కుటుంబాలు వున్నాయి.

Advertisement

మున్సిపల్ బాడీ కోసం స్వరంజిత్ సింగ్ అభ్యర్ధిత్వానికి భారతీయ కుటుంబాలు, హైతి కమ్యూనిటీ, ఇతరుల నుంచి మద్ధతు లభించింది.స్వరంజిత్ సింగ్ విజయంపై లెఫ్టినెంట్ గవర్నర్ సుసాన్ బైసివిచ్ అభినందించారు.ప్రపంచంలో అత్యధికంగా అనుసరించే ఐదవ మతం సిక్కు మతం.15వ శతాబ్ధంలో అవిభక్త భారత్‌లోని పంజాబ్‌లో ఈ మతం పుట్టింది.నేడు ప్రపంచవ్యాప్తంగా 25 మిలియన్లకు పైగా ఈ మతాన్ని అనుసరిస్తున్నారు.అధికారిక గణాంకాల ప్రకారం.5,00,000 మంది సిక్కులు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నివసిస్తున్నారు.కాగా.

మంగళవారం జరిగిన సిటీ కౌన్సిల్ ఎన్నికల్లో రిపబ్లికన్ సిట్టింగ్ మేయర్ పీటర్ నిస్ట్రోమ్ తన ప్రత్యర్ధి డెమొక్రాటిక్ నేత బెటెన్ కోర్ట్‌పై విజయం సాధించారు.బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రేసులో రిపబ్లికన్‌లు ఒక సీటును పొందగా.

డెమొక్రాట్లు పాఠశాల బోర్డులో తమ పట్టు నిలుపుకున్నారు.అనధికారిక ఫలితాల ప్రకారం రిపబ్లికన్ ట్రేసీ గౌల్డ్, గ్రాంట్ న్యూయెండోర్ఫ్ , డెమొక్రాట్‌లు స్వరంజిత్ సింగ్, జోసెఫ్ డెలూసియా, డెరెల్ విల్సన్‌లు గెలిచారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు