అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగంలో భారత సంతతి మహిళకి కీలక పదవి..!!

భారత సంతతికి చెందిన సిక్కు మహిళ కిరణ్ కౌర్ గిల్‌కు అమెరికాలో కీలక పదవి దక్కింది.డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఫెయిత్ బేస్డ్ సెక్యూరిటీ అడ్వైజరీ కౌన్సిల్‌లో ఆమెకు స్థానం దక్కింది.

 Indian-american Sikh Woman Kiran Kaur Gill Appoited To Homeland Security Advisor-TeluguStop.com

కిరణ్ కౌర్ ప్రస్తుతం సిక్కు అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ (ఎస్ఏఎల్‌డీఈఎఫ్)కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.పరిశోధన, విద్య, పౌరులతో చర్చలు, యువత నాయకత్వానికి సంబంధించిన కార్యక్రమాలను ఎస్ఏఎల్‌డీఈఎఫ్‌ పర్యవేక్షిస్తుంది.

కిరణ్ సిక్కు చరిత్రను బోధించడం , కీర్తనల్లో చురుగ్గా పాల్గొనేవారు.

ఎస్ఏఎల్‌డీఈఎఫ్ కంటే ముందు.గిల్ న్యూజెర్సీలోని పర్యావరణ సలహా సంస్థకు అధ్యక్షురాలిగా, సీఈవోగా పనిచేశారు.2014లో యూఎస్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్‌బీఏ)చే ‘‘స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ గా కిరణ్ ఎంపికయ్యారు.2018లో ROI- NJ నివేదిక ప్రకారం న్యూజెర్సీలోని టాప్ 50 అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల్లో ఒకరిగా ఆమె నిలిచారు.అలాగే దక్షిణాసియా మహిళల కోసం నెలకొల్పబడిన ఇన్‌స్పైరింగ్ సౌత్ ఏషియన్ అమెరికన్ ఉమెన్‌కి అధ్యక్షురాలిగా వ్యవహరించారు.

Telugu Asianpacific, Chandra Acharya, Indian American, Kiran Kaur Gill, Jersey,

ఇకపోతే రెండ్రోజుల క్రితం .ఇదే ఫెయిత్ బేస్డ్ సెక్యూరిటీ అడ్వైజరీ కౌన్సిల్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీలో భారత సంతతికే చెందిన చంద్రు ఆచార్యకు స్థానం దక్కిన సంగతి తెలిసిందే.యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన 25 మంది విశిష్ట విశ్వాసపాత్రులైన నాయకులతో కూడిన ఈ కమిటీలో ఆచార్య ఏకైక హిందువు అని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.అమెరికాలోని హిందూ కమ్యూనిటీ, ఇంటర్ ఫెయిత్ ఫోరమ్‌లలో సంభాషణలు, శాంతి కార్యక్రమాల ద్వారా వివిధ విశ్వాస సంఘాల మధ్య వారధిగా ఆచార్య పనిచేశారు.

గత రెండు దశాబ్ధాలుగా సామాజిక సమానత్వం కోసం పనిచేస్తున్న సంస్థల కార్యక్రమాల్లో చంద్రు ఆచార్య చురుగ్గా పాల్గొంటున్నారు.ప్రస్తుతం ఆయన మిచిగాన్‌లోని కాంటన్ టౌన్‌షిప్ ప్లానింగ్ కమీషన్‌లో పనిచేస్తున్నారు.

అంతకుముందు మిచిగాన్ ఆసియా పసిఫిక్ అఫైర్స్ కమీషన్‌లో కమీషనర్‌గా పనిచేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube