భారత సంతతికి చెందిన మహిళా అటార్నీ జూలి ఏ.మాథ్యూ టెక్సాస్ రాష్ట్రంలోని ఫోర్ట్ బెండ్ కౌంటీ జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు.
వరుసగా రెండోసారి ఆమె ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.కేరళలోని తిరువల్లకు చెందిన మాథ్యూ.
కాసరగోడ్‌లోని భీమనడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రమాణ స్వీకారం చేశారు.అలాగే ఫోర్ట్ బెండ్ కౌంటీ కోర్టులో 3వ నెంబర్‌కు ప్రెసిడెంట్‌గా మాథ్యూ నాలుగేళ్లపాటు కొనసాగుతారు.
డెమొక్రాటిక్ పార్టీకి చెందిన జూలీ.ఈ పదవి కోసం ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి ఆండ్రూ డోర్న్‌బర్గ్‌ను 1,23,116 ఓట్ల భారీ తేడాతో ఓడించారు.
దీనిపై జూలీ మాట్లాడుతూ… ఈ ప్రయాణంలో తనకు మద్ధతుగా నిలిచిన వారికి, ఓటర్లకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ మేరకు తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు.2018లో రిపబ్లికన్ ట్రిసియా క్రెనెక్‌ను 8.24 శాతం ఓట్లతో ఓడించి.ఒక యూఎస్ బెంచ్‌కు ఎన్నికైన తొలి ఇండో అమెరికన్ మహిళగా జూలి ఏ.మాథ్యూ చరిత్ర సృష్టించింది.మాస్ టార్ట్, సివిల్ లిటిగేషన్, ప్రొబేట్, క్రిమినల్ విషయాలో మాథ్యూకి పదిహేనళ్లకు పైగా అనుభవం వుంది.

ఫిలడెల్ఫియాలో పెరిగిన ఆమె.పెన్ స్టేట్ యూనివర్సిటీ, డెలావేర్ లా స్కూల్ లో చదువుకున్నారు.మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న యువకులకు సహాయం చేయడానికి జూలీ .జువెనైల్ ఇంటర్వెన్షన్ అండ్ మెంటల్ హెల్త్ కోర్ట్‌ను స్ధాపించారు.ఇక ఫోర్ట్ బెండ్‌లో మలయాళీలతో సహా భారతీయులు అధిక సంఖ్యలో స్ధిరపడ్డారు.ఇక్కడ 28.6 శాతం మంది విదేశీయులు వుంటే వారిలో 51 శాతం మంది ఆసియా అమెరికన్లే.ఇకపోతే.మాథ్యూతో పాటు మరో ఇద్దరు డెమొక్రాట్లు జస్టిస్ కేపీ జార్జ్, సోనియా రాష్‌లు ఫోర్ట్ బెండ్ కౌంటీ నుంచి తిరిగి ఎన్నికయ్యారు.అయితే ఎన్నికల సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మాథ్యూ ప్రచార గుర్తులను దొంగిలించి ధ్వంసం చేయడం కలకలం రేపింది.