శ్రీలంకతో ఆడే భారత జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికీ నో ఛాన్స్..!

సొంత గడ్డపై జరిగే వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) టోర్నీలో భారత్ వరుస విజయాలతో ముందుకు దూసుకు వెళ్తోంది.

ఇప్పటివరకు భారత్( India ) ఆడిన ఆరు మ్యాచ్ లలో మంచి ఘనవిజయాలను సాధించింది.

గురువారం శ్రీలంకతో( Sri Lanka ) జరిగే పోరుకు భారత్ సిద్ధమైంది.ఇప్పటికే ముంబైలోని వాఖండే స్టేడియం కు చేరుకున్న ఇరుజట్లు గెలుపు కోసం ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.

గురువారం జరిగే మ్యాచ్లో గెలిచి అధికారికంగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవాలని భారత్ భావిస్తోంది.మరొకవైపు సెమీస్ విషయం పక్కన పెడితే కనీసం మెరుగైన ప్రదర్శన కనబరచాలనే పట్టుదలతో శ్రీలంక ఉంది.

శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో హార్థిక్ పాండ్యా( Hardik Pandya ) తిరిగి జట్టులోకి వస్తాడనే ప్రచారం జోరుగా సాగుతోంది.బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లతో జరిగిన మ్యాచ్ లకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.భారత జట్టు ఇప్పటికే సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకున్నట్టే.

Advertisement

కాబట్టి హార్దిక్ పాండ్యా పూర్తిగా కోలుకున్న తర్వాత సెమీస్ లో ఆడిస్తారేమో అనే వార్తలు వినిపిస్తున్నాయి.మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా నేరుగా సెమీస్ ఆడించడం సరికాదని మేనేజ్మెంట్ భావిస్తోంది.

కాబట్టి ముంబైలో జరిగే శ్రీలంక మ్యాచ్ లో భారత జట్టులో హార్థిక్ పాండ్యా కలిసే అవకాశం ఉంది.

ఒకవేళ హార్దిక్ పాండ్యా జట్టులోకి వస్తే సూర్య కుమార్ యాదవ్( Surya Kumar Yadav ) మాత్రం బెంచ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది.ఇక భారత జట్టు బౌలింగ్ విషయానికి వస్తే.మహమ్మద్ సిరాజ్ ను( Mohammad Siraj ) పక్కన పెట్టి, అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్ ను తీసుకునే అవకాశం ఉంది.

ముంబై పిచ్ పేసర్లకు చాలా అనుకూలం.కాబట్టి భారత జట్టు ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగనుంది.బ్యాటింగ్ విభాగంలో శ్రేయస్ అయ్యర్ వరుసగా విఫలం అవుతున్నాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఇతని స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.శ్రీలంకతో ఆడే భారత తుది జట్టు ఇదే: రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్/ఇషాన్ కిషన్, కేఎల్.రాహుల్, సూర్య కుమార్ యాదవ్/హార్థిక్ పాండ్యా, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్/శార్ధూల్ ఠాకూర్.

Advertisement

తాజా వార్తలు