ప్రపంచ కప్ లో సినీ గ్లామర్.. మ్యాచ్ కు హాజరుకాబోతున్న స్టార్స్ వీరే!

ఈ రోజు ప్రపంచ కప్( Cricket World Cup ) జరగనున్న విషయం తెలిసిందే.అందుకే మన దేశ వ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ కనిపిస్తుంది.

ఎవరి నోటా విన్న ఎక్కడ చూసిన ప్రపంచ కప్ గురించే చిన్న పెద్ద తేడా లేకుండా అంతా మాట్లాడు కుంటున్నారు.మన ఇండియా ( India ) సుమారు 12 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్ లో ఫైనల్ కు చేరుకుంది.

నవంబర్ 19, ఆదివారం అంటే ఈ రోజు క్రికెట్ అభిమానులే కాదు ప్రతీ ఇండియన్ కూడా ప్రపంచ కప్ ఇండియాకే రావాలని కోరుకుంటున్నారు.అందులోనూ ఈసారి వరల్డ్ కప్ మన స్వదేశం లోనే జరగనుండడం మనకు కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి.

ఈ క్రమంలోనే ఇండియన్స్ మొత్తం కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.మరి సాధారణ ప్రజలే కాదు సెలెబ్రిటీలు సైతం ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు.

Advertisement

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా( India vs Australia ) ఫైనల్ మ్యాచ్ చూసేందుకు రెడీ అవుతున్నారు.అది కూడా లైవ్ లో చూసేందుకు సెలెబ్రిటీలు ఆసక్తి చూపిస్తున్నారు.

మరి ఫైనల్ మ్యాచ్ చూసేందుకు చాలా మంది సెలెబ్రిటీలు అహ్మదాబాద్ చేరుకున్నట్టు తెలుస్తుంది.

అందుతున్న సమాచారం ప్రకారం లైవ్ లో మ్యాచ్ చూసేందుకు ముందు వారిలో ఉన్న టాలీవుడ్ సెలెబ్రిటీ విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) అని చెప్పాలి.అంతేకాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,( Ram Charan ) కింగ్ నాగార్జున( Nagarjuna ) సైతం అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది.వీరితో పాటు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ( PM Modi ) సైతం సందడి చేయనున్నారు.

ప్రస్తుతం వీరి పేర్లే బయటకు వాహిని చాలా మంది సైలెంట్ గా అక్కడికి వెళ్లినట్టు టాక్.మరికొద్ది గంటలు గడిస్తే వారు ఎవరో తెలియనుంది.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

మిగిలిన ఇండస్ట్రీ నుండి పరిశీలిస్తే.బాలీవుడ్ నుండి షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్ కోలీవుడ్ నుండి కమల్ హాసన్, ధనుష్, రజినీకాంత్ సందడి చేయనున్నారట.అలాగే మలయాళం నుండి మోహన్ లాల్ తో పాటు మరికొంత మంది హంగామా చేయనున్నట్టు టాక్.

Advertisement

మొత్తానికి వరల్డ్ కప్ కు సినీ గ్లామర్ తోడయ్యినట్టే చెప్పాలి.

తాజా వార్తలు