జర్మనీ పార్లమెంట్ ఎన్నికల బరిలో భారత సంతతి నేత .. ఎవరీ సిద్ధార్ధ్ ముద్గల్?

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడ కీలక స్థానాలకు చేరుకుంటున్నారు.ముఖ్యంగా రాజకీయాల్లోనూ మనవాళ్లు రాణిస్తున్నారు.

ఎన్నో దేశాల్లో చట్టసభ సభ్యులుగా, మేయర్లుగా, ప్రధానులుగా, అధ్యక్షులుగా భారత సంతతి నేతలున్నారు.తాజాగా యూరప్ ఖండంలోని జర్మనీలోనూ( Germany ) భారతీయుల ప్రాబల్యం పెరుగుతోంది.

తాజాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న జరగనున్న జర్ననీ పార్లమెంటరీ ఎన్నికల( Germany Parliament Elections ) రేసులో భారత సంతతికి చెందిన సిద్ధార్ధ్ ముద్గల్( Siddharth Mudgal ) నిలిచారు.క్రిస్టియన్ సోషల్ యూనియన్ (సీఎస్‌యూ) టికెట్‌పై పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నారు.

తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత సంతతికి చెందిన వ్యక్తిగా సిద్ధార్ధ్ నిలిచారు.ఒకవేళ ఎన్నికల్లో ఆయన గెలిస్తే మాత్రం జర్మన్ పార్లమెంట్‌లో సీఎస్‌యూ టికెట్‌పై గెలిచిన తొలి భారత సంతతి వ్యక్తిగా నిలుస్తారు.

Advertisement

జర్మన్ రాజకీయాలలో క్రిస్టియన్ సోషల్ యూనియన్( Christian Social Union ) బలీయమైన శక్తిగా ఉన్న సంగతి తెలిసిందే.

రాజస్థాన్‌లోని జైపూర్‌లో( Jaipur ) జన్మించిన సిద్ధార్ధ్ ముద్గల్.21 ఏళ్లుగా జర్మనీలో నివసిస్తున్నారు.రెస్టారెంట్‌లో పనిచేసిన స్థాయి నుంచి రాజకీయ నేతగా ఆయన ఎదిగారు.

ఎన్నికల బరిలో నిలవడంపై ఓ జాతీయ మీడియాతో సిద్ధార్ధ్ మాట్లాడుతూ.జర్మనీలోని భారతీయ డయాస్పోరా ఏకీకరణ కావడం లేదన్నారు.

వారిలో ఉన్నత విద్యావంతులు, నైపుణ్యం కలిగిన వారు ఉన్నారని.కానీ వలస సమూహాలలో కలిసిపోయారని తెలిపారు.

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025

ప్రవాస భారతీయులు జర్మన్ ఆర్ధిక వ్యవస్ధ వృద్ధికి బాగా సాయపడుతున్నారని సిద్ధార్ధ్ అన్నారు.జర్మనీలో భారతీయ పౌరులు అత్యధిక సగటు వేతనాలు సంపాదిస్తారని ఆయన పేర్కొన్నారు.ఎన్నికల్లో గెలిస్తే జాతీయ టెక్ హబ్‌లు, స్టార్టప్‌లకు పన్ను రాయితీలు ఇతర అంశాలపై ఆయన ముందుకు సాగనున్నారు.

Advertisement

జర్మన్ - ఇండియన్ కల్చరల్ సెంటర్ స్థాపనకు సిద్ధార్ధ్ మద్ధతు ఇస్తున్నారు.సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి , దేవాలయాల వంటి ఆధ్యాత్మిక ప్రదేశాల అవసరం ఉందని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు.

అధికారిక లెక్కల ప్రకారం.జర్మనీలో దాదాపు 3 లక్షల మంది భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు , భారత సంతతి వ్యక్తులు ఉన్నారు.

తాజా వార్తలు