ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది.దేశంలో ఇప్పటివరకు నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 73 లక్షల 7 వేలకి చేరింది.
తాజాగా గడిచిన 24 గంటల్లో 67,708 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 73,07,098కి చేరింది.
అలాగే , నిన్న దేశంలో కరోనాతో 680 మంది మృతి చెందగా మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,11,266గా నమోదైంది.అలానే గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 71,760 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ప్రసుత్తం ఇండియాలో 8,12,390 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇక దేశంలో నిన్న 11,36,183 కరోనా పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 9,12,26,305 పరీక్షలు చేసినట్టు అయింది.
ప్రపంచ దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పరంగా భారత్ రెండో స్థానంలో ఉంది.ఈ జాబితాలో అమెరికా తొలి స్థానంలో ఉంది.అయితే రోజువారి పాజిటివ్ కేసుల విషయంలో మాత్రం భారత్ తొలి స్థానంలో కొనసాగుతుంది.
ఇక దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, రికవరీల సంఖ్య కూడా భారీగా పెరగడం ఊరటనిచ్చే విషయం.ప్రస్తతం దేశంలో రికవరీ రేటు 87.36% ఉండగా, డెత్ రేటు 1.52% గా ఉంది.