వాట్సాప్ బిజినెస్ ఎక్కువగా మనదేశం మీదే ఆధారపడి ఉంది .. ఎందుకంటే

ప్రపంచంలో వాట్సాప్ ని మించిన మెసేజింగ్ యాప్ మరొకటి లేదు అనేది కాదనలేదని వాస్తవం.

వాట్సాప్ ఇచ్చిన సేవలే కాదు, వాట్సాప్ ని మించిన సేవలు అందించే యాప్స్ వచ్చినా సరే, జనాలు వాట్సాప్ తప్ప మరో మెసేజింగ్ యాప్ లేనట్లు దీని మీదే పడతారు.

చివరకి గూగుల్ విడుదల చేసిన గూగుల్ అల్లో కూడా వాట్సాప్ పై అతిగా ప్రభావం చూపట్లేదు.అది వాట్సాప్ రేంజ్.

కాని మీకో విషయం చెప్పాలి, వాట్సాప్ మాత్రం అత్యధికంగా భారతదేశం మీదే ఆధారపడి ఉంది.ఎలా అంటారా ! వాట్సాప్ నిన్న వెల్లడించిన కొన్ని స్టాట్స్ ప్రకారం ఈ మెసేజింగ్ దిగ్గజాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ మంది వాడుతోంటే, అందులో 160 మిలియన్ల వినియోగదారులు మనదేశంలోనే ఉన్నారట.

అంటే వందల దేశాల్లో, వాట్సాప్ ని అధికంగా వాడే దేశం మనదే అన్నమాట.ఆరకంగా వాట్సాప్ లాభాల్లో 16% మన వల్లే వస్తోందన్నమాట.

Advertisement

మరో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, దీపావళి రోజున ఏకంగా 8 బిలయన్ల మెసేజెస్ వాట్సాప్ ద్వారా వెళ్ళాయట.ప్రపంచంలో టెక్నాలజీ మొదలయ్యాక ఒక యాప్ నుంచి ఇన్ని సందేశాలు వెళ్ళడం ఇదే మొదటిసారి అని ప్రకటించింది వాట్సాప్.

ఇప్పుడు ముక్కున వేలేసుకోండి .అలాగే ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోండి, వాట్సాప్ ని ఎవరు పోషించనంతగా మనం, భారతీయులం పోషిస్తున్నాం.

Advertisement

తాజా వార్తలు