నాలో భారతీయత లోతుగా పాతుకుపోయింది: ఉద్వేగానికి గురైన సుందర్ పిచాయ్

ప్రపంచంలోనే దిగ్గజ టెక్ సంస్థల్లో ఒకటైన గూగుల్‌కు సారథిగా వ్యవహరిస్తున్న భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ తన మాతృదేశాన్ని గురించి చెబుతూ ఉద్వేగానికి గురయ్యారు.

ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో సుందర్ పిచాయ్ ‘ఫ్రీ అండ్‌ ఓపెన్‌ ఇంటర్నెట్‌’పై దాడి, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా, వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్ర సహా పలు ఆసక్తికర విషయాలపై మాట్లాడారు.

రెండు నెలల క్రితం భారతదేశంలో నెలకొన్న కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులను చూసి తాను కంటతడి పెట్టానని సుందర్ పిచాయ్ చెప్పారు.తాను అమెరికన్‌ పౌరుడినే కానీ జన్మత: భారతీయుడినని.తనలో భారతీయత లోతుగా పాతుకుపోయిందన్నారు.

తాను ఎవరు అనే విషయాన్ని ఎవరైనా అడిగినా, లేక నన్ను నేను ప్రశ్నించుకున్నా ఈ భారతీయత నాలో అతి పెద్ద భాగంగా నిలుస్తుందని సుందర్ పిచాయ్ వెల్లడించారు.ఇదే సమయంలో టెక్నాలజీ వైపు, అమెరికా వైపునకు తాను ఎలా వచ్చింది పిచాయ్ గుర్తుచేసుకున్నారు.

దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో తాను జన్మించానని చెప్పారు.టెక్నాలజీలో చోటు చేసుకుంటున్న మార్పులు తనపై ఎంతో ప్రభావం చూపేవని.తన బాల్యంలో చూసిన రోటరి ఫోన్‌, పాత స్కూటర్‌ ఇవన్ని చాలా ఆశ్చర్యపరిచేవని పిచాయ్ పేర్కొన్నారు.

Advertisement

తన తండ్రి ఏడాది మొత్తం జీతాన్ని ఖర్చు చేస్తేగానీ తాను అమెరికా చేరుకోగలిగానని ఉద్వేగానికి గురయ్యారు.కాలీఫోర్నియాలో అడుగుపెట్టినప్పుడు తాను ఊహించుకున్న దానికి వాస్తవ పరిస్థితులకు చాలా తేడా గమనించానని సుందర్ పిచాచ్ వెల్లడించారు.

అమెరికా చాలా ఖరీదైనదని, ఇక్కడ ఓ బ్యాక్‌పాక్‌ కొనాలంటే దాని విలువ మా నాన్న నెల జీతంతో సమానంగా ఉండేదని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కేవలం అదృష్టంతో పాటు టెక్నాలజీపై నాకున్న అభిమానం కూడా నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది’’ అని తెలిపారు సుందర్‌ పిచాయ్‌.

ఇదీ పిచాయ్ ప్రస్థానం: పిచాయ్ జీవిత కథ అసాధారణమైంది.గూగుల్ సీఈవోగా ఆయన ఎదుగుదల అనేది అంతర్జాతీయ టెక్నాలజీ రంగంలో భారత్ అద్భుత ప్రగతికి ఒక నిదర్శనం.తమిళనాడులోని మధురైలో 1972 జూన్ 10న జన్మించిన సుందర్ పిచాయ్ ప్రాధమిక విద్యాభ్యాసాన్ని చెన్నైలోని జవహర్ విద్యాలయలో పూర్తి చేశారు.ప్రాధమిక విద్యాభ్యాసం పూర్తయ్యాక ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చేరారు సుందర్, అనంతరం అమెరికాకు వెళ్లిన సుందర్ పిచాయ్ అక్కడి పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.2004లో గూగుల్‌లో చేరారు.క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ బృందానికి సారథ్యం వహించిన సుందర్.క్రోమ్ బ్రౌజర్‌ను అద్భుతంగా డెవలెప్ చేసి చూపించారు.2015 లో గూగుల్ సీఈఓగా ఎంపికైన సుందర్ పిచాయ్.అనంతరం దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు కూడా 2019 నుంచి సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు