చదరంగంలో భారత ఆటగాళ్లకు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ఫలితం రానే వచ్చేసింది..!

చదరంగంలో భారత ఆటగాళ్లకు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ఫలితం రానే వచ్చేసింది.

స్పెయిన్ వేదికగా శనివారం జరిగిన ఎఫ్ఐడిఈ వరల్డ్ ఉమెన్ టీం చెస్ చాంపియన్షిప్ లో భారత్ ఫైనల్ లో 0-2 తో ఓటమి చవి చూసినా చివరికి రజత పథకం సాధించింది.

అయితే భారత్ తరపున హారిక, తానియా, వైశాలి, భక్తి కులకర్ణి మేరీ జాన్తో కూడిన జట్టు బరిలోకి దిగింది.ఈ పర్ఫామెన్స్ తర్వాత హారిక ద్రోణవల్లి తాను ఎన్నాళ్లగానో ఎదురు చూసిన సమయం వచ్చిందని, సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న లక్ష్యాన్ని సాధించానని ఎంతో ఎమోషనల్ అయ్యింది హారిక.

అయితే 2004 నుంచి టీం ఈవెంట్స్ లో ఆడుతున్నానని గతంలో పలుమార్లు పథకానికి చేరువై దూరమయ్యానని, ఒకట్రెండు సార్లు భావోద్వేగానికి లోనై ఏడ్చేశానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.అయితే ఈ సారి మాత్రం అనుకున్నది సాధించామని, ట్వీట్ ద్వారా గతాన్ని వెల్లడించింది .కెరీర్లో ఇదొక గొప్ప ఫలితమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలకు నాంది పలుకుతుందని ఆశిస్తున్నానని ఆమె తెలిపింది.అలాగే వ్యక్తిగతంగాను ఈ టోర్నీ చిరస్మరణీయంగా నిలిచిందని, మొత్తం 11 గేమ్స్ లో బరిలోకి దిగిన ఏకైక ప్లేయర్ తానేనని తెలిపింది.

చివరకు అజేయంగా నిలిచి వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించినందుకు ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించింది.

Advertisement

2008 లో హారిక ద్రోణావల్లి జూనియర్ కిరీటం దక్కించుకుంది.వరల్డ్ ఛాంపియన్షిప్ లో ఎన్నో మెడల్స్ ను సాధించింది.అయితే ఈవెంట్ వరకు వెళ్లేందుకు సపోర్ట్ అందించిన ఇండియన్ స్టేషన్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

ఈ విషయంపై మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ట్విట్టర్ ద్వారా ఆమెకు అభినందనలు తెలియజేశారు.సిల్వర్ మెడల్ అందుకున్నందుకు టీమిండియా కంగ్రాట్స్ అని పేర్కొన్నారు.ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్ కు తొలి పథకం కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు