స్వతంత్ర అభ్యర్థులు ఏ పార్టీని ముంచబోతున్నారు..?

తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో నిన్నటితో ఎన్నికల ప్రచారాలు ముగిసాయి.

నిన్న మొన్నటి వరకు ప్రచారాలతో క్షణం తీరిక లేకుండా తిరిగిన రాజకీయ నాయకులందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు.

మైకులన్నీ మూగపోయాయి.రాష్ట్రం మొత్తం ప్రశాంతంగా మారిపోయింది.

అయితే రేపు అనగా నవంబర్ 30న పోలింగ్ జరగబోతుంది.ఈ పోలింగ్ లో ఊహించని పరిణామాలు ఏర్పడబోతున్నాయి.

అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్( BRS ) ,కాంగ్రెస్ మాత్రమే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు.కొన్ని కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీలకు గట్టి పోటీని ఇస్తున్నాయి.

Advertisement

అయితే ఈ స్వతంత్ర అభ్యర్థులు ఏ పార్టీ కొంప ముంచబోతున్నాయో అని చాలామంది రాజకీయ నాయకులు భావిస్తున్నారు.

స్వతంత్ర అభ్యర్థులతో పాటు బీఎస్పీ( BSP ) , ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు.వీళ్లే కాకుండా ప్రధాన పార్టీలలో టికెట్ ఆశించి భంగపడ్డ చాలామంది రెబల్స్ కూడా నామినేషన్స్ లో ఉన్నారు.వీరి వల్ల ఆ పార్టీలో ఉండే చాలావరకు ఓట్లు చీలిపోతాయి.

ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెబల్ నామినేషన్ వేస్తే ఆ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలిపోతాయి.ఇలా చాలా చోట్ల నాయకులు టికెట్ ఆశించి భంగపడి నామినేషన్ వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు.

వీరి వల్ల ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

ప్రతి నియోజకవర్గంలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికలకు ముందే వారి వారి నియోజకవర్గాల్లో ఎంతో కొంత ప్రజలకు సేవ చేశారు.ఈ కారణంతో కొంతమంది ఓటర్లు ఈ స్వతంత్ర అభ్యర్థులకు ఓట్లు వేసే అవకాశం ఉంది.ఈ లెక్కన ఒక నియోజకవర్గంలో రెండు లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో 15 వేల నుండి 20వేల వరకు స్వతంత్ర అభ్యర్థుల ( Independent candidates ) కు ఓట్లు పడే అవకాశం ఉంటుంది.

Advertisement

ఇక ఆ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలుగా ఉన్న బిజెపి, కాంగ్రెస్( Congress ) ,బీఆర్ఎస్ మూడు పార్టీలకు ఓట్లు చీలిపోతాయి.దీంతో ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపు కష్టతరంగా మారుతుంది.

ఇక నియోజకవర్గాల్లోని ప్రధాన పార్టీ నాయకులందరూ స్వతంత్ర అభ్యర్థులను మొదటి నుంచి ఎంత భుజ్జగించినా కూడా వారు వెనక్కి తగ్గలేదు.అయితే వీరి వల్ల ఎంతో కొంత నష్టం మాత్రం ప్రధాన పార్టీలు చవి చూసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తాజా వార్తలు