ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో మంగళవారం అన్ని పార్టీలు ప్రజలకు ఆఖరి సందేశాలు ఇవ్వడానికి ఉత్సాహం చూపించాయి.కొంతమంది ఆశలు రేకెత్తిస్తే కొంతమంది ఎమోషనల్ ప్రకటనలు ఇచ్చారు.అదేవిధంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy )తెలంగాణ ప్రజలకు ఎక్స్ వేదికగా వీడియో సందేశాన్ని ఇచ్చారు.60 సంవత్సరాల పోరాటం వందలాది మంది తెలంగాణ బిడ్డల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ( KCR )ను 10 ఏళ్ల పాటు త ముఖ్యమంత్రిని చేస్తే ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, ఇంత విధ్వంసం తర్వాత కూడా మూడోసారి అధికారం లోకి రావాలని భావిస్తున్నారని, కానీ ప్రజలందరూ ఒక కొత్త మార్పుకి నాంది పలకాలని ఆయన ఈ ఈ సందేశంలో కోరారు .
రాష్ట్రంలోని నిరుద్యోగులు అందరూ కాంగ్రెస్ పార్టీకి ( Congress party )అండగా నిలబడాలని, ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ ఏర్పడిందో అది సాకారం కావాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని ,సోనియమ్మ ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం రావడానికి మీరందరూ అండగా నిలబడాలని ఆయన కోరారు.మీ రేవంతన్న సందేశం 10 ఏళ్ల విధ్వంసాన్ని పాత రేద్దాం ,ప్రజా ఆకాంక్ష పాలన మొదలెడదాం, చేయి చేయి కలుపుదాం అగ్ర పధాన తెలంగాణను నిలుపుదాం అంటూ ట్వీట్ చేశారు.
మొదటినుంచి హోరా హోరిగా పోటీపడుతున్న కాంగ్రెస్ బిఆర్ఎస్ లు చివరి నిమిషం వరకూ ఎన్నికల ప్రచారాన్ని ఒకే టెంపో లో పూర్తి చేశాయి.ఇక పోల్ మ్యానేజ్మెంట్ లో కూడా ఈ రెండు పార్టీలు ఒకరి తో ఒకరు గట్టిగానే పోటీ పడబోతున్నట్టు తెలుస్తుంది .ఎట్టి పరిస్తితి లోనూ హంగ్ రాకుండా ఏకపక్షం గా అదికారం లోకి రావాలని కాంగ్రెస్ చూస్తుంటే కొన్ని సీట్లు తగ్గినా ఎమ్ ఐ ఎమ్ మరియు బిజేపి ల మద్దత్తు తో అయినా బి ఆర్ ఎస్ మరో సారి ప్రభుత్వాని ఏర్పాటు చేసే అవకాశం ఉందని కొంత మంది అంచనా వేస్తున్నారు