మల్లెపూలు అలంకరణకే కాదు ఇలా కూడా ఉపయోగపడతాయని తెలుసా?

మల్లెపూలు.అమ్మాయిల్లో చాలా మంది ఇష్టపడే ఫ్లవర్స్ లో ఇవి ముందు వరుసలో ఉంటాయి.

మల్లెపూల( jasmine flowers ) నుంచి వచ్చే సువాసన మనసుకు ఎంతటి ఆహ్లాదాన్ని అందిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మల్లెపూలను కేశ అలంకరణకే కాకుండా డెకరేషన్ కు కూడా విరివిగా వాడుతుంటారు.

అంతేనా అంటే కానే కాదు.మల్లెపూలతో మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ముఖ్యంగా మధుమేహం ( diabetes )ఉన్నవారికి మల్లె పూలతో తయారు చేసిన టీ ఒక వరం అని చెప్పుకోవచ్చు.మల్లె పువ్వులోని హైపోగ్లైసీమిక్ ( Hypoglycemic )గుణం రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

Advertisement

మల్లెపూలతో టీ తయారు చేసుకుని నిత్యం తాగితే మ‌ధుమేహం కంట్రోల్ లో ఉంటుంది.మల్లె టీలో పాలీఫెనాల్స్ అనే శక్తివంతమైన మొక్కలు ఆధారిత సమ్మేళనాలు ఉంటాయి.

ఇవి మ‌న బాడీలో శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ ( Antioxidants )గా ప‌ని చేస్తాయి.క్యాన్సర్‌, గుండె సమస్యల ముప్పును పెంచే ఫ్రీ రాడికల్స్ ను నాశ‌నం చేస్తాయి.

కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయి.

అలాగే మ‌ల్లెపూల టీ జ్ఞాపకశక్తి సామర్థ్యం, దృష్టి, ఏకాగ్రత, ప్రశాంతత, చురుకుదనాన్ని ప్రోత్సహిస్తుంది.డిప్రెషన్, నిద్రలేమి( Depression, insomnia ) వంటి ప్ర‌మాద‌క‌ర‌మైన స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది.అల్జీమర్స్ వ్యాధి వ‌చ్చే రిస్క్ ను త‌గ్గిస్తుంది.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

అందుకే మ‌ల్లెపూల టీను బ్రెయిన్ బూస్ట‌ర్ గా ప‌రిగ‌ణిస్తారు.వెయిట్ లాస్ అవ్వాల‌ని భావిస్తున్న వారికి కూడా మ‌ల్లెపూల టీ ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.

Advertisement

రోజుకు ఒక క‌ప్పు మ‌ల్లెపూల టీ తాగ‌డం వ‌ల్ల మెట‌బాలిజం రేటు వేగ‌వంతం అవుతుంది.దాంతో కేల‌రీలు త్వ‌ర‌గా క‌రిగి బ‌రువు త‌గ్గుతారు.

అంతేకాదు చర్మ ఛాయను పెంచడానికి మల్లెపూలు తోడ్పడతాయి.మల్లెపూలను మెత్తగా నూరి రసం తీసి ముఖానికి అప్లై చేసుకోవాలి.ఇర‌వై నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా చేస్తే స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.ఇక స్క్రీన్ టైమ్ ఎక్కువ అయినప్పుడు ఒక్కోసారి కళ్ల నుంచి నీరు కారుతూ ఉంటాయి.

అలాంటి సమయంలో మల్లెపూలను మెత్తగా నూరి తడి క్లాత్ లో కట్టి కళ్లపై పెట్టుకోవాలి.ఇలా చేస్తే కళ్ళు నుంచి నీరు కారడం తగ్గుతుంది.

తాజా వార్తలు