హైకోర్టు న్యాయమూర్తిచే గుట్ట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట తులసీ కాటేజీ ప్రాంగణంలో జిల్లా అధికారులు అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేసిన నూతన జూనియర్ సివిల్ జడ్జి ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు భవనాన్ని శనివారం హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ ఈవీ.

వేణుగోపాల్ ప్రారంభించారు.

అనంతరం కోర్టు ఆవరణలో జడ్జిలు మొక్కలు నాటారు.ఈ కోర్టు పరిధిలోకి యాదగిరిగుట్ట,రాజాపేట మండలాలకు చెందిన సివిల్,క్రిమినల్ కేసులు రానున్నాయి.

ఈ కోర్టుకు తాత్కాలిక న్యాయమూర్తిగా ఆలేరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జస్టిస్ సూర సుమలత వ్యవహరించనుండగా,నెలలోపు శాశ్వత జడ్జిని ప్రభుత్వం నియమించనున్నట్లు తెలుస్తుంది.ఈకార్యక్రమంలో హైకోర్టు జడ్జిలు జస్టిస్ టి.వినోద్ కుమార్, కె.లక్ష్మణ్,కె.సుజన, యాదగిరిగుట్ట బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

ప్రభుత్వ బడిలో చదివి 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు
Advertisement

Latest Video Uploads News