కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో దొంగస్వాముల హల్ చల్

కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో నకిలీ స్వామిజీలు హల్ చల్ చేశారు.క్షుద్రపూజలు చేస్తామంటూ ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం.

అయ్యప్పస్వామి భక్తుల వేషధారణలో వచ్చిన దుండగులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు.ఇళ్లల్లో వ్యక్తులు చనిపోతారని భయపెట్టి క్షుద్రపూజలు చేయాలని చెప్పారని స్థానికులు చెబుతున్నారు.

ఈ విధంగా మొత్తం ఐదు కుటుంబాల దగ్గర నుంచి దొంగ స్వాములు డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది.అనంతరం బెదిరింపులు తీవ్రతరం కావడంతో నకిలీ స్వాములుగా గుర్తించిన అసలు అయ్యప్ప స్వాములు వారిని వెంబడించి పట్టుకున్నారు.

అనంతరం పోలీసులకు అప్పగించారు.

Advertisement
ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?

తాజా వార్తలు